రెండు రోజుల క్రితం చంద్రబాబు అనని మాటలను, పదే పదే అన్నారు అంటూ, వ్యాఖ్యల చేసిన జగన మోహన్ రెడ్డి పై, తెలుగుదేశం పార్టీ సభాహక్కుల నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ గేట్లు మూసేసి చంద్రబాబుని, ఎమ్మెల్యేలను ఆపిన సమయంలో, మార్షల్స్ కు, చంద్రబాబుకు మధ్య జరిగిన వాగ్వివాదంలో, చంద్రబాబు బాస్టార్డ్ అన్నారు అంటూ జగన్ పదే పదే చెప్పారు. అయితే, తాము నో క్వస్చిన్ అని అన్నామని, వెంటనే జగన్ మోహన్ రెడ్డి పై, సభా హక్కుల నోటీస్ కింద చర్యలు తీసుకోవాలని టిడిపి కోరింది. అయితే మూడు రోజులు అయినా, ఈ విషయం పై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ సభా హక్కుల నోటీస్ ఉండగానే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరో సభా హక్కుల నోటీస్ ఇచ్చింది. శాసనసభ కార్యదర్శికి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాదర్ నోటీసులు అందజేశారు. నిన్న జరిగిన సభలో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి, వీరందరూ బఫూన్లు అంటూ, జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేసారు.

jagan 17122019 2

దీని పై అభ్యంతరం చెప్తూ, తెలుగుదేశం పార్టీ ఈ రోజు జగన్ పై సభా హకుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది. ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి, నిబంధనలను జగన్ ఉల్లంఘిస్తున్నారని నోటీసులో తెలుగుదేశం పార్టీ పేర్కొంది. అయితే ఇదే నోటీసులో స్పీకర్ పై కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. తాము పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే, పాయింటే లేదంటూ స్పీకర్ తమ పై వ్యాఖ్యలు చేస్తున్నారని, తమ హక్కులను కాలరాస్తున్నారని, అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా క్యస్షన్ హావర్ ప్రారంభం కావడానికి ముందే మంత్రులు, ఎమ్మెల్యేలతో స్పీకర్ మాట్లాడిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆ ఫిర్యాదులో తెలిపింది. అయితే ఇదే విషయం పై సభలో కూడా టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నిరసన తెలిపారు.

jagan 17122019 3

స్పీకర్ పై నిరసనతో, నల్లచొక్కాతో అసెంబ్లీకి హాజరయ్యారు. మీరు కనీసం పాయింట్ అఫ్ ఆర్డర్ కూడా లేవనెత్తే అవకాసం ఇవ్వటం లేదు, అందుకే నల్ల చొక్కా వేసుకొచ్చాను అంటూ, స్పీకర్ కే చెప్పారు. అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ , వైసీపీ నేతగానే వ్యవహిరిస్తున్నారని అన్నారు. జగన మోహన్ రెడ్డి, సైగ చేస్తే మైక్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ రూల్స్ కు విరుద్ధంగా సభ నడిపిస్తున్నారని అన్నారు. మమ్మల్ని బఫూన్ల అంటున్నారని, జగన్‌ కరుడుగట్టిన ఆర్థిక నేరస్థుడని, ఫ్యాక్షన్‌ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మరో పక్క చంద్రబాబు కూడా జగన్ వ్యాఖ్యల పై మాట్లాడుతూ, ‘‘మమల్ని సీఎం బఫూన్లు అని అంటున్నారు...మేము బఫూన్లైతే...సీఎం జగన్ ఏంటి?. బఫూన్ల కంటే పెద్ద పదం వాడాల్సి వస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read