తిరుమల విశిష్టతను పెంచుతూ, వెంకన్న సేవలో తరించే భక్తుల కోసం ఎస్వీబీసీ ఛానల్ ని తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టిన విషయం తెలిసిందే. అయితే 5 నెలల క్రితం ఎస్వీబీసీ ఛానల్ లో ఉన్న ప్రముఖ నటుడు పృధ్వీ అశ్లీల ఆడియో లీక్ బయట పడటంతో ఆయన్ను తప్పించారు. అయితే ఇప్పుడ మరోసారి ఇలాంటి అశ్లీల ఘటనలతో విరక్తి పుట్టించే ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో, ఇలాంటి మనుషులతో టిటిడి పరువు కూడా పోయే పరిస్థితి ఉంది. శ్రీవారి భక్తుల మనోభావాలు కూడా దెబ్బ తినే అవకాసం ఉంది. గత కొద్ది రోజులుగా క్రితమే, ఈ ఘోరం బయట పడింది. హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ పై వచ్చిన ఒక వ్యక్తి, హైదరాబాద్ ఆఫీస్ లో శతమానం భవతి కార్యక్రమం కోసం పని చేస్తున్న ఒక ఆంకర్ కి, గత కొద్ది రోజులుగా పో-ర్న్ సైట్ కి సంబంధించిన కొన్ని లింక్స్ పంపించారు. దీంతో ఆమె విస్తు పోయి, ఆధారాలతో సహా పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసారు. ఈ నేపధ్యంలో, ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించిన టిటిడి అధికార యంత్రాంగం, ఎస్వీబీసీ పై దాడులు చేయాలని టిటిడి విజిలెన్స్ అధికారులను, నూతనంగా ప్రరంభించిన సైబర్ క్రైమ్ ని కూడా ఆదేశించటంతో, వాళ్ళు రంగంలోకి దిగారు. ఎస్వీబీసీ తిరుపతి కార్యాలయంకు వెళ్లి సోదాలు చేసారు. అ సమయంలో, పో-ర్న్ సైట్ లింక్స్ పంపించిన వ్యక్తి వాడె మెయిల్స్, అన్నీ స్వాధీనం చేసుకున్నారు. అలాగే మిగతా సిబ్బంది కంప్యూటర్ లు కూడా, చెక్ చేయటంతో, మరో విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి.
మరో ముగ్గురు కూడా, ఇలాగే పో-ర్న్ సైట్ లు ఎస్వీబీసీ ఆఫీస్ లో చూస్తునట్టు గుర్తించారు. దీంతో వీరి నలుగురు పై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. మెయిల్ పంపించిన ఉద్యోగస్తుడిని, ఉద్యోగం నుంచే తప్పించాలని సూచన చేసారు. అయితే ముగ్గురు కాదని, 25 మంది ఇలాగే చూసినట్టు గుర్తించారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఎంతో పవిత్రంగా ఉండాల్సిన చోట, ఇలా పో-ర్న్ సైట్ లు చూడటం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రత రోజు రోజుకీ ఎదో ఒక వివాదంతో, పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారు ఇచ్చే భక్తుల కానుకలతో జీతాలు తీసుకుంటూ ఇలా ప్రవర్తించడం హేయమైన చర్య అంటూ టీటీడీ భక్తి ఛానల్ ఎదుట ఆందోళన కూడా చేసారు. భక్తి ఛానల్ పునరావాస కేంద్రంగా మార్చారని భక్తితో ఉండాల్సిన చానల్లో గతంలో ఒక కమెడియన్ ని తీసుకుని పెట్టి నాశనం చేయడంతో పాటు భక్తి ఛానల్ లో బాధ్యతారహితంగా ఎంప్లాయిస్ ప్రవర్తించేలా CEO లు ఉన్నతాధికారులు పని చేస్తున్నారని దీనిపై తక్షణమే చర్యలు తీసుకొని సిబిసిఐడి ఎంక్వయిరీ చేసి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు ఉద్యోగస్తుల ప్రక్షాళన మొదలుపెట్టాలని వారు అన్నారు.