ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు నెలల క్రిందట, హిందువులు దేవాలయాల టార్గెట్ గా జరిగిన ఘటనలు అందరినీ కలిచి వేసాయి. ఏదో ఒక ప్లాన్ గా చేస్తున్నాటు జరిగిన ఘటనలు చూస్తే అర్ధం అవుతుంది. అయితే పోలీసులు నిఘా వల్ల కానీ, మరే ఇతర కారణాల వల్లో కానీ, ఈ ఘటనలు ఆగిపోయాయి. అప్పుడప్పుడు జరుగుతున్నా, అప్పట్లో జరిగినట్టు వరుస పెట్టి జరగలేదు. అయితే ఈ జరిగిన ఘటనల్లో, ఒక ఘటన మాత్రం, తీవ్ర దుమారం రేపింది. అదే దక్షిణ కాశీగా పిలిచే, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రధం దగ్దం ఘటన. రాత్రికి రాత్రి ఈ రధం తగలబడి పోయింది. ఇప్పటికీ ఇది ఎవరు చేసారో తెలియదు. ఎవరో పిచ్చోడు చేసాడని నమ్మించే ప్రయత్నం కూడా చేసారు. తరువాత రధం పైన తేనే తుట్టు ఉంది, దాని కోసం ఎవరో అంటించారని అన్నారు. ఎవరు చేసారో ఏమో కానీ, హిందువులు మనోభావాలు ఈ ఘటనతో దెబ్బ తిన్నాయి. రధం అలా మంటల్లో తగలబడి పోతుంటే, అందరూ ఆవేదన చెందారు. అయితే ఈ ఘటన , రాజకీయంగా కూడా వేడెక్కింది. తెలుగుదేశం, బీజేపీ పార్టీలు ఈ ఘటన పై నిరసనలు తెలిపాయి. చివరకు అనేక ఉద్రిక్త పరిణామాలు తరువాత, ప్రభుత్వం కూడా దిగి వచ్చింది. ఈ ఘటనను సిబిఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. ఆందోళనలు విరమించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా, తమ మీద నింద లేకుండా, కేంద్రం పరిధిలోకి నెట్టేస్తూ, సిబిఐ విచారణకు ఆదేశించింది.
దీంతో బీజేపీ కూడా ఈ విషయాన్ని రాజకీయం చేయాలనుకున్నా, కుదరలేదు. అయితే ఈ రాజకీయ అంశాలు పక్కన పెడితే, భక్తుల మనోభావాలతో ఉన్న అంశం కావటంతో, సిబిఐ విచారణకు ఆదేశించటంతో, అసలు దోషులు ఎవరో బయట పడతారని, నిజం తెలుస్తుందని అందరూ భావించారు. అయితే మూడు నెలలు దాటినా, ఇప్పటికీ సిబిఐ విచారణ ప్రారంభం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం, ఫైల్స్ అన్నీ ఇచ్చి, సిబిఐకి కేసు అప్పగించినట్టు వార్తలు వస్తున్నా, సిబిఐ మాత్రం ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు, విచారణ ప్రారంభించ లేదు. అంతే కాదు అసలు ఈ కేసు తీసుకుంటారో లేదో కూడా, ఇప్పటికీ తెలియదు. మరో పక్క రాష్ట్ర పోలీసులు కూడా ఈ కేసు పై విచారణ ఏమి చేస్తున్నట్టు లేరు. మరి నిజం ఎవరు చెప్తారు ? రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా, కేంద్రం పరిధిలోని సిబిఐకి ఇచ్చేసింది. మరి రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్ర పెద్దల పై ఒత్తిడి తెచ్చి, ఈ కేసు విచారణ చేయమని కోరలేరా ? రాష్ట్ర బీజేపీ ఈ విషయంలో, నిరసన తెలిపింది కదా ? సిబిఐ కేంద్ర పరిధిలోదే కదా ? మరి రాష్ట్ర బీజేపీ ఎందుకు ఒత్తిడి తీసుకు రాదు ? మొత్తానికి, దేవుడికి జరిగిన అన్యాయం ఏమిటో, ఎప్పుడు బయటకు వస్తుందో, వేచి చూడటం తప్ప, ఏమి చేయలేం.