పార్లమెంట్ సాక్షిగా తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రసంగంపై అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు. నిండు సభలో మోదీ చేసిన మోసాన్ని కడిగిపారేసిన గల్లా జయదేవ్ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. కానీ ఇది పవన్ దృష్టిలో వ్యర్ధమైన ప్రసంగం అయ్యిందంటే. ఏ స్థాయిలో పవన్ రాజకీయ అవగాహన ఉందో అర్ధం చేసుకోవచ్చు. విమర్శించాల్సిన అంశాలలో విమర్శించవచ్చు, తప్పులేదు, కానీ కేంద్రాన్ని ఒత్తిడి తెస్తున్న సమయంలోనే సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వంపై మరింతగా పవన్ విమర్శలు గుప్పించడం సరైన రాజకీయం అనిపించుకోదు. పవన్ ప్రసంగం పై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ స్పందించారు.
పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ "నిన్న పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీలందరు.. రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ముక్తకంఠంతో లేవనెత్తారు. ట్వీట్టర్ పవన్ కళ్యాణ్, కన్ ప్యూజన్ పవన్ కళ్యాణ్.. చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన లేదు. తెలుగు దేశం గురించి హేళనగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంపై, సమస్యలపై అవగాహన లేదు. అవిశ్వాసంపై మద్దతు కూడగడతానన్న పవన్ ఎక్కడ ఉన్నారు. అవిశ్వాసానికి మద్దతు తెలపని పవన్ కళ్యాణ్...ఎంపీలపై కామెంట్ చేయడం సరైంది కాదు. హైదరాబాద్ లో ఇంటిలో కూర్చొని ట్వీట్ లు చేయడం కాదు. అనేక విధాలుగా పార్లమెంట్ లో మేము పోరాటం చేశాం. ఎంపీలు ఎంతో పోరాటం చేస్తుంటే.. ఎం చేశారంటూ ప్రశ్నించడం సరికాదు."
"వ్యక్తిగత ప్రయోజనాలు మీకు.. మీ అన్నయ్య, మీ బావమరిది తెలిసినట్లు ఎవరికి తెలియదు. రాజ్యసభ సీటు, కేంద్రమంత్రి పదవి కోసం మీరు ప్రజారాజ్యం పార్టీని ఢిల్లీలో తాకట్టుపెట్టారు. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రమంత్రి పదవులనే త్యాగం చేశాం. దేశం మొత్తం మీద మోదీని ప్రశ్నించింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. పవన్ కళ్యాణ్ మోడీని ఎందుకు ప్రశ్నించరు..? వ్యర్ధ ప్రసంగాలు చేసేది మీరు ?.. ఉత్తరాంధ్రలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేది మీరు. టీడీపీ ఎంపీల ప్రసంగాలకు సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ వస్తుంది. రాష్ట్రానికి అన్యాయం జరిగితే చిన్న నిరసన కూడా చెయ్యలేదు. ఆదర్శ కుంభకోణంతో సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. మీ ట్వీట్టర్ అకౌంట్ ను ఢిల్లీ నుంచి బీజేపీ డీల్ చేస్తుందా ? ట్విట్టర్ లో విమర్శలు కాదు.. ప్రజల్లోకి వచ్చి మోడీని నిలదీయ్యండి. పదవికోసం పార్టీని మూసేసిన చరిత్ర మీది. ఇప్పటి వరకు ఎవరైనా క్రెడిబులిటీ ఉన్న వ్యక్తులు మీ పార్టీలో చేరారా ?" అని అనురాధ పవన్ ను ప్రశ్నించారు.