టైటిల్ చూసి ఖంగారు పడకండి... 19వ స్థానం అనే సరికి, అది సరిగ్గా అర్ధం చేసుకోలేని వాళ్ళు, 19వ స్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టిన చంద్రబాబు డౌన్ డౌన్ అంటున్నారు.... కాని, 19వ స్థానంలో రాష్ట్రం ఉంది, అవినీతిలో... చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటికి, అవినీతిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది... ఈ ఇమేజ్ ఉంటే, పెట్టుబడులు రావని, ముందుగా అవినీతి లేకుండా చెయ్యాలి అని ముఖ్యమంత్రి సంకల్పించారు...ఏసీబీకి పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చారు... సమర్ధవంతమైన అధికారిగా పేరు ఉన్న, ఠాకూర్ ని, ఏసీబీ డీజీగా నియమించారు... ఈ సంవత్సర కాలంలో, ఏసీబీ దూకుడు చూసి కేంద్రం కూడా శభాష్ అంది అంటే, మన ఏసీబీ ఎలా పని చేస్తుందో అర్ధమవుతుంది... గత ఏడాది నవంబరులో డీజీగా బాధ్యతలు స్వీకరించిన ఠాకూర్, ఈ ఏడాదికాలంలో ఏసీబీ సాధించిన ప్రగతి గురించి బుధవారం విజయవాడలో మీడియాతో పంచుకొన్నారు...
ఏసీబీ డీజీ ఠాకూర్ మాట్లాడుతూ, అభివృద్ధిలో ఏపీని నంబర్ వన్‌గా నిలపాలన్న చంద్రబాబు ఆశయానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నాం. ప్రజల సహకారంతో ముందుకు వెళుతున్నాం. ఏపీలో ఏసీబీ దూకుడు చూసి ప్రజలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వ్యతిరేకులు తమకు సమాచారం ఇచ్చి సహకరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1100 ద్వారా విలువైన సమాచారం ఇచ్చిందని, సోషల్ మీడియాలోను యువత బాగా స్పందించిందని ఠాకూర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితంగా రాష్ట్రంలో పెద్ద పెద్ద అవినీతిపరులను అరెస్టు చేయగలిగాం. లంచం అడిగే వారికి గాలం వేసి పట్టుకున్నాం అని వివరించారు.
ఏడాది కాలంలో, లంచం తీసుకొంటూ 146మంది దొరికారు అని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో 47 మందిని పట్టుకున్నామని, ఇతరత్రా కేసులు, ఆకస్మిక తనిఖీలు, విచారణలను కలుపుకొని 303 కేసులు నమోదు చేశామన్నారు. అవినీతి కేసుల్లో 39మందికి జైలు శిక్ష పడిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతికి పాల్పడిన 17మంది ఉద్యోగం నుంచి డిస్మిస్ అయ్యారని, పదవీ విరమణ చేసిన తొమ్మిది మందికి పెన్షన్లు, ఇతరత్రా చెల్లింపులు ఆగిపోయాయని చెప్పారు... అవినీతి అధికారులని రెడ్... ఆరెంజ్... గ్రీన్... క్యాటగిరీగా పెట్టామని, ప్రజల్ని పీడించే అత్యంత అవినీతి పరులను రెడ్‌జోన్ గా, ప్రతి పనికీ లంచం అడిగే వారిని ఆరెంజ్ జోన్‌లో, ఆరెంజ్ జోన్ లో ఉన్నవారు మంచిగా మారితే గ్రీన్ జోన్‌లోకి పెడుతున్నామని చెప్పారు... రెడ్ క్యాటగిరీ నుంచి ఏ మాత్రం కదలని వారి ఇంటి తలుపు తడుతున్నామన్నారు.