భారత్లో ప్రైవేటు కార్పొరేట్ పెట్టుబడులకు నవ్యాంధ్ర సరికొత్త చిరునామాగా మారింది. పెట్టుబడిదారులకు స్వర్గధామంగా అవతరించింది. ప్రైవేటు కార్పొరేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో నవ్యాంధ్ర దక్షిణాది రాష్ట్రాల్లో ప్రథమ స్థానాన్ని.. దేశంలో మూడో స్థానాన్ని దక్కించుకుంది..
దేశంలో పెట్టుబడుల వృద్ధి, భవిష్యత్ అంచనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నిధులతో ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు పెట్టిన పెట్టుబడులను, అందులోనూ రూ.10 కోట్లకు పైబడిన అంచనా వ్యయం గల ప్రాజెక్టులను మాత్రమే ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నారు..
ఈ నివేదిక ప్రకారం...గుజరాత్ 22.7 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 8.6 శాతంతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 8.2 శాతం తో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. మధ్య ప్రదేశ్ (7.4 శాతం), కర్ణాటక (6.6 శాతం), తెలంగాణ (5.5 శాతం), తమిళనాడు (4.5 శాతం) వరుసగా నాలుగు, ఐదు, ఆరు, ఏడో స్థానాల్లో నిలిచాయి. మిగిలిన అన్ని రాష్ట్రాలు కలిపి 11.8 శాతం పెట్టుబడులు సాధించాయి.
క్రిందటి ఏడాది, టాప్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని, ఈ సారి గుజరాత్ టేక్ ఓవర్ చేసింది.. మహారాష్ట్ర కూడా, స్వల్ప తేడాతోముందంజులో ఉంది... అన్నిట్లో మనతో పోటీ పడే తెలంగాణా, 6వ స్థానంలో ఉంది... రాజధాని కూడా లేని మన రాష్ట్రాన్ని, చంద్రబాబు ఎలా ముందుకు తీసుకువేళ్తున్నారు, ఎవర్ని చూసి పెట్టుబడులు వస్తున్నాయి అనేదానికి ఇది ఒక ఉదాహరణ... కబుర్లు చెప్పుకుంటూ, మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటే, పెట్టుబడులు రావు అనే దానికి కూడా, ఇది ఒక ఉదాహరణ...