ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ దేశవ్యాప్త గుర్తింపు పొందింది. దేశంలోనే అత్యున్నత దర్యాప్త సంస్థగా పేరొందిన సీబీఐ అంతర్గత సమావేశాల్లో అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారంలో ఏపీ ఏసీబీ వ్యవహరిస్తున్న తీరు పై ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఇదే విషయాన్ని శుక్రవారం విజయవాడలో ఏసీబీ అధికారులతో భేటీ సందర్భంగా సీబీఐ దక్షిణ ప్రాంత జాయింట్ డైరెక్టర్ ఏవైవీ కృష్ణ వెల్లడించారు.

ఏపీ ఏసీబీ కేసుల పై వివరాలు సేకరించడంతో పాటు సీబీఐలో ఆ తరహా విధానాల అమలు పై అనేక సందర్భాల్లో చర్చించినట్లు ఆయనపేర్కొన్నారు. తరుచూ తమ ఉన్నత స్థాయి సమావేశాల్లో ఏపీ ఏసీబీ నిర్వహిస్తున్న పాత్ర పై చర్చిస్తున్నామని చెప్పడంతో ఏసీబీ అధికారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సైతం ఏసీబీ నిర్వహిస్తున్న విధానాలను తీసుకొని ముందుకు వెళ్లాలని సూచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నా రు. అక్రమాస్తుల కేసుల్లో పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో సీబీఐ తరుపన సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయనపేర్కొన్నారు.

ఇటీవల రూ.వందల కోట్ల అక్రమ ఆస్తులతో పట్టుబడిన డాక్టర్ పాము పాండురంగారావు, రఘు, జగదీశ్వరరెడ్డి, ఎం.గంగాధర్ వంటి అధికారుల కేసుల్లో తాము దర్యాప్తు చేసిన విధానాన్ని సీబీఐ అధికారులకు వివరించారు.

అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చూపిస్తున్న చొరవ, ఏసీబీ కి అన్ని రకాలుగా సహకరించటం, ఎంత వరకైనా వెళ్ళాలి అని చెప్పటం, ఇవి కూడా ఏసీబీ అధికారులు, సీబీఐ అధికారులకు వివరించారు. 1100తో ప్రజలే నేరుగా ఫిర్యాదులు చేస్తున్న వైనాన్ని కూడా వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read