కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో హామీలు ఇచ్చారు, మాట తప్పరు, మడం తిప్పరు అని చెప్తారు, ఇక మన జీవితాలు మారిపోతున్నాయి, సంతోషమే సంతోషం అని భావించిన వివిధ వర్గాల ప్రజలు, రాష్ట్రంలో పోరాట బాట పడే పరిస్థితి వచ్చింది. ఇసుక లేక కూలి పని చేసుకునే వారి దగ్గర నుంచి, చిరు ఉద్యోగులు దాకా, మా జీవితాలు మార్చేస్తాడని నమ్మి జగన్ కు ఓటు వేశాం, ఇప్పుడు కనీసం పనులు లేక, ఉద్యోగ భద్రత లేక, రోడ్డున పడ్డాం అంటూ, రోజుకి ఒక వర్గం ప్రజలు, ఆందోళనలు చేస్తూ, ఉద్రిక్త పరిస్థితులు ఉండటం, మనం చూస్తున్నాం. ఈ రోజు వంతు, ఏపీలో ఏఎన్ఎంలది. తమకు కొత్తగా వస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల, తమ ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తూ, వారు ఈ రోజు ధర్నా చేసారు.

dharna 30072019 2

తమకు ఉద్యోగ భద్రత కలిగించాలని, కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. కొత్తగా వస్తున్న గ్రామ సచివాలయ పోస్టుల్లో ముందుగా తమకే ప్రాధాన్యం ఇవ్వాలని, తమ ఉద్యోగాలను ముందుగా క్రమబద్ధీకరించిన తరువాతే, కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామని, ప్రతి రోజు ఆందోళన చేస్తున్నామని, అసెంబ్లీ జరుగుతున్నా సరే, మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదని వారు ఆందోళన చేసారు. ఈ రోజు డీఎంహెచ్‌వో కార్యాలయాల ముట్టడికి ఏఎన్‌ఎంలు ప్రయత్నించారు. అయితే ఏఎన్‌ఎంలు చేసిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, వారిని ఈడ్చి అవతల పడేసారు. ఆడవాళ్ళు అని కూడా చూడకుండా, విచక్షణ లేకుండా ప్రవర్తించారు.

dharna 30072019 3

దీంతో కొంత మందికి గాయాలు కూడా అయ్యాయి. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, తమ కళ్లల్లో జగన్ ప్రభుత్వం కారం కొట్టిందని ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరి ఆందోళన పై చంద్రబాబు స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు, ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఉన్న ఉద్యోగాలు ఊడబీకి, కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తూ, ఇదే ఉద్యోగ కల్పన అంటూ ప్రచారం చేస్తున్న వీరిని ఏమనాలో అర్ధం కావటం లేదని అన్నారు. పెర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఎందుకు ఇచ్చారని నిలదీశారు. తమ సమస్యలు చెప్పుకుందామని వస్తే ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకుంటారా? ఇది సీఎం ఇల్లా లేక లోటస్ పాండ్ లాంటి ప్రైవేటు రాజభవనమా?" అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు. ఒక్కరి ఉద్యోగం కూడా తియ్యటానికి వీలు లేదని, హామీ నిలబెట్టుకోవాలని చంద్రబాబు కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read