ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.... ఇది ఒక రణరంగం... అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఇలాగే ఉంటాయి కాని, మన అసెంబ్లీలో ప్రతిపక్షం వల్ల, మనకు ఇంకా ఎక్స్ట్రా వినోదం... ఎప్పుడు చూడు, అగ్లీ సీన్స్ కనిపిస్తూనే ఉంటాయి... అగ్లీ సీన్స్ చేస్తాం అని చెప్పి మరీ, అసెంబ్లీ పరువు తీసిన మహానుభావులు ఉన్నారు... ఒక లేడి ఎమ్మల్యే అయితే, జుబుక్సాకరంగా, నాలుక లపలపలాడిస్తూ, ఈలలు వేస్తూ, బూతులు తిడుతూ చేసిన హంగామా కూడా చూసాం... మరి కొంత మంది, లారీ క్లీనర్లు కూడా వెయ్యని వేషాలు అసెంబ్లీలో వేసారు... మనకు తెలిసి ఒక్కసారైనా ప్రజలకు ఉపయోగపడే చర్చ జరగలేదు... ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రభుత్వ పక్షం కంటే, బాధ్యత ఎక్కువగా ప్రతి పక్షానికి ఉంటుంది... వారు ఆ బాధ్యత మర్చిపోయి, అగ్లీ సీన్స్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వటంతో, అసెంబ్లీ అంటేనే చులకన భావం ప్రజల్లో వచ్చింది...
అయితే ఇవాల్టి నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది... ప్రభుత్వ పక్షంలో ఉన్న ఎమ్మల్యేలు, ప్రతి పక్ష పాత్ర పోషిస్తున్నారు... వారి సమస్యలు, తదితర మంత్రులకు చెప్తూ, మంత్రుల సమాధానాలు సంతృప్తి లేకపోతే, హామీ పొందే వరకు అడుగుతున్నారు... మిత్ర పక్షం అయిన బీజేపి ఎమ్మల్యే కూడా, ఇలాంటే మంత్రులకి సమస్యలు వివరిస్తూ, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారు... దానికి మంత్రులు తగిన పరిష్కారంతో కూడిన సమాధానాలు ఇస్తున్నారు... చంద్రబాబు కూడా, వారి ఎమ్మల్యేలకు హిత బోధ చేసారు... సీరియస్‌గా ప్రిపేరై అసెంబ్లీకి రావాలని, మీ నియోజకవర్గంలో ఎదుర్కుంటున్న అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవాలని చెప్పారు...ప్రతిపక్షం పాత్ర మనమే పోషించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రులతో సీఎం చెప్పారు. ఇందుకు స్పందించిన పయ్యావుల కేశవ్ మేం సిద్ధంగా ఉన్నామంటూ చమత్కరించారు...
దీనంతటికీ కారణం ప్రతి పక్ష ఎమ్మల్యేలు లేకపోవటం... తన పాదయత్ర జరుగుతున్నది కాబట్టి, తానూ లేకుండా ఎవరూ అసెంబ్లీలో కూర్చోవటం ఇష్టం లేని జగన్, వారి ఎమ్మల్యేలను కూడా సభకు వెళ్ళనివ్వలేదు... అసలు ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ జరగటం, ప్రపంచంలోనే ఇప్పటిదాకా ఎక్కడా లేదు.... ప్రజా సమస్యలు లేవనెత్తి, ప్రభుత్వం చేత పనులు చేపించుకోవటానికి, అసెంబ్లీ కంటే మరో వేదిక ఉండదు.. మరి అలాంటింది, ప్రజల గోల అక్కర్లేదు అనుకున్నారో, లేక ముఖ్యమంత్రి కుర్చీ సంకల్ప యాత్ర ముఖ్యం అనుకున్నారో, మొత్తనికి అసెంబ్లీకి డుమ్మా కొట్టి, నాంపల్లి కోర్ట్ కి వెళ్లి, అక్కడ సంతకం పెట్టి, మళ్ళీ పాదయత్రకు వెళ్తూ, అసెంబ్లీలో అగ్లీ సీన్స్ లేకుండా చేసింది ప్రతిపక్షం... ప్రతిపక్షం పాత్ర కూడా తామే పోషిస్తూ, అరుదైన గుర్తింపు పొందింది అధికార పక్షం...