ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఏ రాజకీయపార్టీ అయిన తమ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు, కాని ఏపీలో విచిత్రం ఏమంటే బీజేపీ నేతలు ప్రతిపక్షం నేత ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటన చేయడంతో అంతర్గతంగా బీజేపీ,వైసీపీ ఎన్నికల తరువాత కలుస్తాయని స్పష్టంగా తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్నికలు ముందు పొత్తు పెట్టుకుంటే కేంద్రం విభజన హామీలు అమలు చేయక పోవడంతో వైసీపీ పై ప్రజల్లో తప్పుడు సంకేతం కలుగుతుందని అందు కోసం బహిరంగ చెప్పడం లేదని రాజకీయ వర్గాలలో చర్చజరుగుతుంది.

ap bjp 04092018

ఈ మధ్య కాలంలో తెలుగు దేశం అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుపై బీజేపీ శాసనపక్షనేత విష్ణుకుమార్ రాజు టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందని, దీంతో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్లో ఇబ్బందులు తప్పవని విజయవాడకు మకాం మార్చారని ఘాటుగా విమర్శించారు. ఈతరుణంలో వైఎస్ జగన్ గ్రాప్ పెరిగిందని, 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష నేత జగన్ సీఎం అవుతారని చెప్పడంతో రాజకీయ వర్గాలు అవాక్కయ్యాయి. గత రెండు సంవత్సరాల క్రితం బీజేపీని పొగిడిన నోటితోనే చంద్రబాబు ఇప్పుడు విమర్శలు చేస్తున్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, వీళ్ళు చేసిన నమ్మక ద్రోహం గురించి మాత్రం, మాట్లాడటం లేదు.

ap bjp 04092018

అవినీతలో పూర్తిగా కూరుకుపోయిన టీడీపీ బండారాన్ని బయట పెడతామని విష్ణుకుమార్ రాజు సంచలన వాఖ్యాలు చేశారు. వచ్చే సార్వత్రి ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం అని చంద్రబాబు గ్రాఫ్ క్రమంగా పడిపోయిందని అన్నారు. అదే సమయంలో వైసీపీ,జనసేన గ్రాఫ్ పెరిగిందని చెప్పడంతో రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఈనేపధ్యంలో చూస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ,జనసేనాతో కలిసి పోటీ చేయకపోయిన ఎన్నికల తరువాత కలిసి పోయే అవకాశాలు ఎక్కుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేంద్రం అమలు చేయవాల్సిన విభజన హామీలు గురించి నిలదీయడం లేదని ఏపీ బీజేపీ నేతలపై వివిధ రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తమ పార్టీ అభ్యర్థి సీఎం కావాలి అని చెప్పకుండా ప్రతి పక్షనేత సీఎం అవుతాడని చెప్పడంలో అంతర్యం ఏమిటీ అని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. బీజేపీ నేతలు కేంద్రం చేసిన విభజన హామీలు అమలు చేయడంలేదని మాట్లాడకుండా అధికార పార్టీ నేతలను విమర్శించడం ఎంతవరకు న్యాయం అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేంద్ర అన్యాయం చేసిందని ఏపీ ప్రాజానీకం వ్యతిరేకిస్తుంటే ఏపీ బీజేపీ నేతలు కేంద్రం న్యాయం చేసిందని గొప్పలు చెప్పుకుంటున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read