ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన కోట్ల హరిచక్రపాణి రెడ్డి పోటీ నుంచి తప్పుకుని టీడీపీకి జై కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ ఎంపీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుని ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం చివరి రోజు కావడంతో పలు చోట్ల రెబల్స్ పోటీ నుంచి తప్పుకున్నారు. టీడీపీ నుంచి తొమ్మిది మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకుని పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, రాజంపేట పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మహేశ్వరెడ్డి ఊహించని విధంగా నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

bjp 29032019

కడప జిల్లా రామాపురం మండలం పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎన్ఆర్ఐ మహేశ్వరరెడ్డిని బీజేపీ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. గురువారం మధ్యాహ్నం తన నామినేషన్ ఉపసంహరించుకున్న మహేశ్వరరెడ్డి ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ జోష్ చూసి బీజేపీలో చేరి రాజంపేట లోక్‌సభ టిక్కెట్ దక్కించుకున్నట్టు ఎన్ఆర్ఐ మహేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటిలో బీజేపీకి కాస్త క్యాడర్ ఉన్నా, లోతుకు వెళ్లి చూస్తే పరిస్థితులు అనుకూలంగా లేవని అర్ధమైందని అన్నారు. అందువల్లే నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు వివరించిన మహేశ్వర్ రెడ్డి, తాను తొలి నుంచి వైసీపీలో ఉన్నానని, తదుపరి కార్యాచరణపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని అన్నాడు.

bjp 29032019

వైసీపీకి మద్దతుదారుగా ఉన్న మహేశ్వరరెడ్డి టిక్కెట్ కోసమే తమ పార్టీలో చేరినట్టు బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఒత్తిడి చేయడం వల్లే ఆయన పోటీ నుంచి తప్పుకున్నారా? అనే కోణంలో అనుమానిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా రాజంపేట నుంచి పురందేశ్వరి పోటీచేయగా ఆమెకు 4,26,990 ఓట్లు లభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాయలసీమలోనే అడుగుపెట్టబోతున్నారు. కర్నూలులో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసగించనుండగా, రాజంపేట అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ నేతలు కంగారుపడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read