ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎంపిక విషయంలో కేంద్రం పదే పదే పెడుతున్న ఇబ్బందులతో, రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది... ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి అధ్యక్షతన అమ‌రావ‌తిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గం భేటీ జరిగింది. ఈ స‌మావేశంలో పోలీస్‌యాక్ట్-2017 ముసాయిదా బిల్లు అంశం పై చర్చించారు. పోలీస్‌యాక్ట్-2017 ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు వల్ల కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే స్వయం నిర్ణయంతో డీజీపీని నియమించుకునే అవకాశం ఉంది.

ap cabinet 16122017 1

దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎంపికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిర్ణయాధికారం కలిగి ఉండేందుకు వీలు కలుగుతుంది. ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులను ఎంపిక చేసుకొని అందులోంచి ఒకరిని డీజీపీగా ఎంపిక చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్ర‌స్తుత డీజీపీ సాంబశివ‌రావు ప‌ద‌వీ కాలాన్ని పొడిగించే అంశంపై యూపీపీఎస్సీ అంగీక‌రించ‌ని నేప‌థ్యంలో ఈ ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. క‌ర్ణాట‌క త‌ర‌హాలో ఏపీ ప్ర‌భుత్వ‌మే డీజీపీని నియ‌మించేలా ఆర్డినెన్స్ తీసుకురానున్నారు...

ap cabinet 16122017 1

కాగా, 2014 పోలీస్‌యాక్ట్ ప్రకారం.. కేంద్రానికి ముగ్గురు సీనియర్ అధికారుల జాబితాను పంపించి అందులో ఒక పేరును ఎంపిక చేసుకునేవారు. తాజాగా ఏపీకి కొత్త డీజీపీ నియామకంపై ఆరుగురు సీనియర్ అధికారుల పేర్లతో కూడిన ప్రతిపాదనను కేంద్రానికి మూడుసార్లు పంపింది. అయితే ఆ ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపింది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ చర్యలతో విసిగిపోయి.. 2014 చట్టానికి సవరణ తీసుకురావాలని భావించి.. 2017 పోలీస్‌యాక్ట్ ముసాయిదాను ఆమోదించింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read