ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు క-రో-నా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఏడాది జూన్, జూలై నెలల కాలంలో, రోజుకు పది వేల కేసులు వరుకు వచ్చేవి. ఇప్పుడు అదే స్థాయిలో ఈ రోజు కేసులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఒక్క రోజు కొత్తగా 9,716 కరోనా కేసులు వచ్చాయి. 38 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులు 60,208 ఉండగా, డిశ్చార్జయినవారు 9,18,985 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా ఇప్పటి వరకు 9,86,703 పాజిటివ్ కేసులు ఉండగా, 7,510 మంది మృతి చెందారు. ఇక ఏపిలో ప్రభుత్వ పనితీరు పై, ప్రతిపక్షం టిడిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగుదేశం నాయకులు కాకి గోవింద రెడ్డి మాట్లాడుతూ, "రాష్ట్రంలో క-రో-నా సెంకండ్ వేవ్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుంది. క-రో-నా-తో ఇప్పటి వరకు షుమారు 7000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సెక్రటరియేట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ప్రాణాలు కోల్పోయారు. క-రో-నా బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాల్సిన భాధ్యత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఉంది. భారతదేశంలో ఓదార్పు పేరు చేబితే జగన్ మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఆనాడు పాదయాత్రలో అనేకమందిని ఓదార్చారు. మరి ఈ రోజు క-రో-నా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యలను ఓదార్చాల్సిన భాధ్యత మీపై లేదా? ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాకుండా ప్రభుత్వ ఉద్యోగులు క-రో-నా కట్టడి చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులవి ప్రాణాలు కావా? మీవే ప్రాణాలా అని మేం ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. క-రో-నా మహమ్మారి భారినపడి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తున్నారు."
"క-రో-నా మొదటి దశలో మద్యం షాపులు తెరిచి క-రో-నా వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేసింది. ప్రభుత్వం ఆదాయం చూసుకుంది కానీ ప్రజల ప్రాణాలను గాలికొదిలేసింది. ఈరోజు క-రో-నా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమని ప్రపంచ సంస్థలు, డాక్టర్లు చెబుతున్న క్రమంలో...ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చి క-రో-నా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ప్రజలను ఓదార్చాలని డిమాండ్ చేస్తున్నాం. క-రో-నా వ్యాప్తికి కారణమౌతున్న మద్యం దుకాణాలను ప్రభుత్వం తక్షణమే మూసివేయాలి. జగన్ మోహన్ రెడ్డి, ఆయన మంత్రి వర్గం తక్షణమే బయటకు వచ్చి క-రో-నాపై ప్రజల్ని చైతన్యవంతులను చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల్ని మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయిన సంగతి అందరికీ తెలుసు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఈ రోజు ఫ్రంట్ లైన్ వర్కర్లకు జీతాలు ఇవ్వడం లేదు. అనేక మందిని ఉద్యోగాల నుండి తీసివేశారు. ఎవరిని ఎప్పుడు తీసేస్తారో, ఎప్పుడు తీసుకుంటారో తెలియని పరిస్థితి. టీకా ఎప్పుడు వస్తుందో తెలియదు. హాస్పిటల్ లో బెడ్ లు ఎక్కడున్నాయో తెలియదు. ఆక్సిజన్ ఎక్కడుందో తెలియని పరిస్థితులలో రాష్ట్ర ప్రజలు ఆందోళనలో ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం." అని అన్నారు.