మాజీ ఐఏఎస్ అధికారి, అలాగే జగన్ మోహన్ రెడ్డి దగ్గర మొన్నటి వరకు సిఎంఓలో ముఖ్య కార్యదర్శిగా పని చేసిన పీవీ రమేష్ ఇంటికి ఏపి సిఐడి అధికారులు వెళ్ళటం సంచలనం కలిగించింది. జగన్ మోహన్ రెడ్డి దగ్గర పీవీ రమేష్ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన సమయంలో, చివరలో ఆయనను పక్కన పెట్టారు. తరువాత ఆయనను పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు. తాజాగా ఆయన హైదరబాద్ ఇంటికి సిఐడి అధికారులు వెళ్ళటం చూస్తుంటే, ఏదో కేసులో ఆయన్ను అరెస్ట్ చేయటానికి చూస్తున్నట్టు అర్ధం అవుతుంది. పీవీ రమేష్ గత చంద్రబాబు ప్రభుత్వంలో ఫైనాన్సు డిపార్టుమెంటు కు ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పని చేసారు. తరువాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, ముఖ్య కార్యదర్శిగా జగన్ , ఆయన్ను ఏరి కోరి నియమించారు. తరువాత ఏమి అయ్యిందో ఏమిటో తెలియదు కానీ, ఆయన్ను అక్కడ నుంచి పీకేసారు. ఇప్పుడు ఆయన ఇంటికి సిఐడి పోలీసులు రావటం అనేది చర్చనీయంసం అయ్యింది. కొద్ది రోజుల క్రిందటే, హైదరాబాద్ లో మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీ నారయణ ఇంటికి, సిఐడి అధికారులు వెళ్లి, నానా రచ్చ చేయటం చూసాం. ఇది చివరకు హైకోర్టుకు వెళ్లి, అరెస్ట్ చేయవద్దు అంటూ ఆదేశాలు ఇచ్చింది.
ఇప్పటికే అనేక మందిని సిఐడి అధికారులు వేధిస్తున్నారు అనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు సిఐడి అధికారులు పీవీ రమేష్ ఇంటికి వెళ్ళటం అంటే, ఏదో స్కెచ్ ఉందనే అనుకుంటున్నారు. పీవీ రమేష్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసే యత్నం తెలుసుకుని పీవీ రమేష్ కూడా విస్మయం వ్యక్తం చేసారు. స్థానికంగా ఉన్న హైదరాబాద్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఏపి సిఐడి పోలీసులు వచ్చినట్టు తెలుస్తుంది. పీవీ రమేష్ ఇంట్లో, రిపేర్ లు జరుగుతూ ఉండటంతో, ఆయన అక్కడ ఉండటం లేదని తెలుస్తుంది. దీంతో సిఐడి అధికారులు వెళ్ళిపోయారు. స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, పోలీసులు వెళ్ళటం పై విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా లక్ష్మీనారాయణ ఇంటికి కూడా ఇలాగే వెళ్లారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములా ఉపయోగించారు. తరువాత విషయం తెలుసుకుని, హైదరాబాద్ పోలీసులు, అక్కడకు వచ్చి పరిస్థితి గమనించి వెళ్లారు. అయితే అసలు ఎందుకు పీవీ రమేష్ ను అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారో తెలియాల్సి ఉంది.