తండ్రిలా రాష్ట్రాన్ని కాపాడుతున్నారు... మరి పిల్లలకి హాని చేస్తే ఊరుకుంటారా ? ఊరి కాని ఊరిలో చదవుకుంటానికి వెళ్ళిన పిల్లలను ఇబ్బంది పెడితే, వెంటనే రంగంలోకి దిగారు... మీకు నేనున్నా అంటూ, మన పిల్లకి భారోసా ఇచ్చారు... మణిపూర్ రాష్ట్రంలోని ఎన్ఐటీలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు స్థానిక విద్యార్థులు దాడులు జరిగాయి. స్థానిక విద్యార్థులు రౌడీలతో దాడులు చేయంచడంతో పలువురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
కాలేజీలో లోకల్, నాన్ లోకల్ విషయంలో విద్యార్థుల మద్య గొడవ జరిగింది. దీంతో మణిపూర్ ఎన్ఐటీ క్యాంపస్ ఉద్రిక్తంగా మారింది. క్యాంపస్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో తెలుగు విద్యార్థులంతా ఒకే గదిలో తలదాచుకున్నట్లుగా సమాచారం. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. స్వయంగా మణిపూర్ రాష్ట్ర డీజీపీ షాహీద్ క్యాంపస్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
మరోవైపు, ఈ గొడవ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది... దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు, మణిపూర్ సీఎం బైరన్ సింగ్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఎన్ఐటీలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఎన్ఐటీకి స్పెషల్ సీఎస్, అదనపు పోలీస్ బలగాలను పంపిస్తున్నామని చంద్రబాబుతో బైరన్ సింగ్ తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. మణిపూర్ ఎన్ఐటీలో తెలుగు విద్యార్ధులు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు.