ఒక రాష్ట్రం అప్పులు తీసుకోవటం అనేది కొత్త కాదు. మనం గత కొన్నేళ్ళుగా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే, అప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఆ తీసుకువచ్చిన అప్పులను అభివృద్ధి కార్యక్రమాలకు, లేక ఇతర ఆదాయం వచ్చే మార్గాలకు ఖర్చు పెడుతూ, మనకు ఉన్న అవకాశాన్ని బట్టి మాత్రమే, అప్పులు చేస్తూ, తక్కువ వడ్డీకు అప్పులు తెచ్చుకుంటూ ఉండేవారు. అయితే గత 14 నెలలుగా వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రాన్ని అప్పుల కుప్పుగా చేసిందని, చాలా రిపోర్ట్స్ ఇప్పటికే చెప్తూ వస్తున్నాయి. అయితే ఆ తెచ్చిన అప్పులు అన్నీ, పధకాలకు ఖర్చు పెట్టటం, మరో ప్రమాదకర అంశం. అంటే అభివృద్ధి శూన్యం. ఇక పొతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు చేస్తూ, ఎలాంటి ప్రమాదకర స్థితిలోకి వెళ్ళిపోతుందో చెప్తూ, ప్రముఖ సంస్థ, క్రెడిట్ రేటింగ్స్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే మనకు అర్ధం అవుతుంది. మన రాష్ట్ర రుణ-జీఎస్డీపీ నిష్పత్తి, 34.6 శాతానికి చేరుకొని, కలవర పెడుతుంది. 14వ ఆర్ధిక సంఘం సూచన మేరకు, రుణ-జీఎస్డీపీ నిష్పత్తి 25 శాతం వరుకే ఉండాలి.

మన రాష్ట్రము కంటే పెద్ద రాష్ట్రాలు అయిన మహరాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు, మనకంటే ఎక్కువ అప్పులు తెచ్చినా, ఈ నిష్పత్తి మాత్రం లిమిట్ లోనే ఉంది. పక్కన ఉన్న తెలంగాణా రాష్ట్రం కేవలం 21.4 శాతం మాత్రమే ఉంది. అలాగే ప్రభుత్వ గ్యారంటీతో ఒకే ఏడాది 49 వేల కోట్లు అప్పు తీసుకుని, ఈ అంశంలో కూడా ఏపి ఫిస్ట్ ఉంది. తెలుగుదేశం సీనియర్ నేత యనమల కూడా ఈ విషయం పై ధ్వజమెత్తారు. గత 64 ఏళ్ళుగా, సగటున ఏడాదికి 5 వేలు కోట్లు అప్పు చేస్తే, రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం హయంలో ఏడాదికి రూ.26 వేల కోట్ల అప్పు చేస్తే, జగన్ ప్రభుత్వం, ఏకంగా రూ.70 వేల కోట్లు అప్పు, ఒక్క ఏడాదిలో చేసిందని అన్నారు. ఈ లెక్కన ఈ 5 ఏళ్ళలో, 3.5 లక్షల అప్పు చేస్తారని, 64 ఏళ్ళలో మన రాష్ట్ర చేసిన అప్పు, ఈ 5 ఏళ్ళలో జగన్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. రాష్ట్రము ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుందని, కొంత కాలానికి అప్పు కూడా ఎవరూ ఇచ్చే పరిస్థితి వస్తే, మన పరిస్థితి ఘోరంగా ఉంటుందని అన్నారు. సంపద సృష్టి పై దృష్టి ఏ మాత్రం, ఈ ప్రభుత్వానికి లేదని, ఇది రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతుందని అన్నారు. ఇప్పటికే ఆస్తులు అమ్ముకే స్థితికి వచ్చామని గుర్తు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read