వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు సర్వం సిద్ధమైంది... ఈ సదస్సు ప్రారంభ ఉత్సవాలు అట్టహాసంగా జరగనున్నాయి... మరి కాసేపట్లో సదస్సులో ప్రధాని మోడీ తొలి ఉపన్యాసం ఇస్తారు... ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బృందం కూడా పాల్గొనాల్సి ఉంది... ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇక్కడకు రానున్నారు... అయితే, దీని కంటే ముందే చంద్రబాబు, మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తీవ్ర సమస్య పై మాట్లాడాలి అంటూ, టెలికాన్ఫరెన్స్ ఏర్పాట్లు చెయ్యమన్నారు... మనకు ఇంకా టైం ఉంది కదా, వేస్ట్ చెయ్యటం ఎందుకు, ఆ సమస్య పై చర్చిద్దాం అంటూ, టెలికాన్ఫరెన్స్ మొదలు పెట్టారు..
ప్రధానంగా ధాన్యం కొనుగోళ్ళ పై చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు... పట్టిసీమ వల్ల కృష్ణాజిల్లాలో వరిపంట పుష్కలంగా చేతికొచ్చిందని సీఎం అన్నారు... చేతికొచ్చిన వరి పంటకు తగు విధంగా రైతులు ప్రయోజనం పొందేలా పగడ్భందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.... పట్టిసీమ వల్ల రైతులు... ముఖ్యంగా కృష్ణా జిల్లా ప్రజలకు పుష్కలంగా చేతికొచ్చిన పంటకు తగు విధంగా గిట్టుబాటు ధర వచ్చేలా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు...
పట్టిసీమ వల్ల రైతులకు చేగూరిన అదనపు ప్రయోజనానికి తగు ప్రతిఫలం దక్కాలని చెప్పారు... వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగి రైతులకు అండగా నిలవండి అని చెప్పారు... రైతులకు ఏ మాత్రం నష్టం కలిగినా సహించేది లేదని చెప్పారు... ముఖ్యంగా కృష్ణా జిల్లా కలెక్టర్ అప్రమత్తంగా వ్యవహరించి గిట్టుబాటు ధర పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు.... దావోస్ లో వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో రైతుల విషయంలో ప్రత్యేకంగా అధికారులతో సమాలోచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేసారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...