ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగుతోంది.. ముఖ్యంగా మొబైల్స్ తయారీ రంగంలో దూసుకుపోతుంది... చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు, ఒక్క సెల్ ఫోన్ కూడా మన రాష్ట్రంలో తయారయ్యేది కాదు. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సంవత్సరానికి 6 కోట్ల సెల్ ఫోన్లు మన రాష్ట్రంలో తయారవుతున్నాయి. దేశంలో ఎలక్ర్టానిక్స్ ఉత్పత్తులను పెంచేందుకు భారీ ప్రణాళిక రూపొందించాం. ఈ ప్రక్రియకు ఆంధ్రప్రదేశే కీలకం కానుంది అని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ మహేంద్రో అన్నారు. తిరుపతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు తదితర అంశాలపై చర్చించేందుకు మహేంద్రో శుక్రవారం అమరావతికి విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ గత నాలుగేళ్లలో సెల్ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్ పరికరాల ఉత్పత్తిలో అత్యంత పురోగతి సాధించింది. ఏటా 6 కోట్ల మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేస్తూ దేశంలోనే అత్యధిక తయారీ రాష్ర్టాల్లో రెండో స్థానానికి ఎగబాకింది.
అంతే కాదు... భారత్‌లో ఎలక్ర్టానిక్స్ తయారీ పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రంగానూ నిలిచింది. సుపరిపాలన, నాయకత్వం, విశ్వసనీయత, ఉద్యోగుల లభ్యత, శాంతిభద్రతలు తదితర 43 అంశాల్లో పాయింట్లు కేటాయిస్తే అందులో ఏపీ నంబర్‌వన్‌గా నిలిచింది. దేశంలో ప్రస్తుతం ఏటా 22.5 కోట్ల సెల్ఫోన్లు తయారవుతున్నాయి. 2019 నాటికి దాన్ని 50 కోట్లకు పెంచాలన్నది లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలనకు అత్యధిక పాయింట్లు లభిస్తున్నాయి. తిరుపతి-శ్రీకాళహస్తి జోన్‌కు పలు సెల్‌ఫోన్ కంపెనీలు వచ్చాయి. ఈ ప్రభుత్వం ఫాక్స్‌కాన్ లాంటి అతిపెద్ద కంపెనీని తీసుకురాగలిగింది. పలు ఇతర సెల్‌ఫోన్ కంపెనీలూ వచ్చాయి.
దీంతో రాబోయే కాలంలో దిగ్గజ సెల్‌ఫోన్ తయారీ కంపెనీలు, ఎలక్ర్టానిక్స్ పరికరాల తయారీ రంగ సంస్థల్ని ఆకర్షించేందుకు ఒక మార్గం ఏర్పడింది. ఏపీ పురోగతి దేశానికీ ఉపకరిస్తుందనే ఉద్దేశంతో తిరుపతిలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటుచేస్తున్నాం. సెల్ఫోన్లపై పరిశోధన, లేటెస్ట్ డిజైన్లపై ఇది దృష్టిపెడుతుంది. మరోవైపు ఇప్పటికే తిరుపతి సమీపంలో వెంకటేశ్వర ఎలక్ర్టానిక్స్ తయారీ క్లస్టర్ (ఈఎంసీ)ని ఏర్పాటుచేయగా.. పలు సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇలాంటి మరో భారీ ఈఎంసీని ఆ సమీపంలోనే ఏర్పాటుచేయబోతున్నాం. ఈ నాలుగేళ్లలో దిగ్గజ సెల్‌ఫోన్, ఎలక్ర్టానిక్స్ కంపెనీలను తీసుకురావడంలో ఏపీ విజయం సాఽధించింది. భవిష్యత్తులో ఈ రంగంలో చైనాను ఢీకొట్టే అవకాశం ఏపీకి ఉంది. ప్రపంచంలో అత్యధిక సెల్ఫోన్లు తయారుచేసే దేశాల్లో ఇటీవలే భారత్ రెండోస్థానంలోకి వచ్చింది. వియత్నాంను అధిగమించి ఈ స్థానం దక్కించుకుంది. అయితే నెంబర్‌వన్‌గా కావడమే లక్ష్యం. దానికి ఏపీనే కీలకం.