రాష్ట్రానికి ఆదాయం బాగున్నప్పుడు, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు, 13 వ తేదీ వచ్చినా జగన్ రెడ్డి సర్కారు ఉద్యోగులకు ఎందుకు జీతాలుచెల్లించలేదని, ఉద్యోగులు కలెక్టరేట్ల వద్ద ధర్నాలుచేసే దుస్థితిని పాలకులు వారికి ఎందుకు కల్పించారో సమాధానం చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం...! “అవ్వాతాతలకు బిడ్డనని, అక్కాచెల్లెళ్లకు సోదరుడినని, యువతకు అన్ననని చెప్పుకునే జగన్ రెడ్డిని ఏమని పిలవాలో తెలియనిస్థితి ఉద్యోగులది. జీతాలకోసం రోడ్లెక్కి, కలెక్టరేట్ల వద్ద ధర్నాలుచేసే దుస్థితికి ఉద్యోగులు వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఎప్పుడో 1950ల నాటి ఇబ్బందికర పరిస్థితుల్ని, మరలా ఇప్పుడు ఉద్యోగులు అనుభవిస్తున్నారు. 13లక్షల ఉద్యోగులకు ఒకటోతేదీనే జీతాలిచ్చామని చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదు. అప్పులు పుట్టకే జగన్ రెడ్డి, ఉద్యోగుల జీతభత్యాలు ఆపాడు. ప్రభుత్వం ఉద్యోగులపై కక్షసాధింపులకు పాల్పడుతోంది. ఇటీవల ఒక మంత్రి ఉద్యోగులు ప్రభుత్వం కాళ్లుపట్టుకోవాలంటున్నాడు. అంతటి దుస్థితి వారికి ఎప్పటికీ రాదని తెలుసుకోండి. ఉద్యోగులు ప్రజలు ఎన్నుకుంటే ఉద్యోగాల్లోకి రావడంలేదని మంత్రి గ్రహించాలి. ఏం తప్పుచేశారని ఉద్యోగులు ప్రభుత్వం కాళ్లుపట్టుకోవాలి. 13వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వమే కాళ్లుపట్టుకోవాలి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే ఉద్యోగులకు శాపంగా మారాయి.

సలహాదారులు, వాలంటీర్ల ప్రయోజనాలకోసం ఉద్యోగులు ఎందుకు ఇబ్బంది పడాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. పెన్షన్లు, జీతాలరూపంలో ప్రభుత్వం ఉద్యోగులకు ఏటా రూ.60వేలకోట్లు ఇస్తుంది. దానిలో తిరిగి మరలా రూ.55వేలకోట్లు మార్కెట్లోకే వస్తుంది. ఈఎమ్ఐలు, ఇతరత్రా చెల్లింపులు, అవసరాలకోసం ఆ సొమ్మంతా ఉద్యోగులు చాలావరకు ఖర్చుపెడతారు. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.2,200కోట్లు ఇవ్వాల్సి ఉందని జనవరి 2022లో జగన్ ప్రభుత్వమేచెప్పింది. జీపీఎఫ్ కి అప్లై చేస్తే ఎప్పుడొస్తుందో తెలియని స్థితి. మెడికల్ రీయింబర్స్ మెంట్ ఫీజులు ఎప్పుడొస్తాయో అర్థంకావడంలేదు. ఆఖరికి ఇన్సూరెన్స్ ప్రీమియంకూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వముంది. రెగ్యులర్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు డీఏబకాయిలు సహా అన్నీకలిపి జగన్ సర్కారు రూ.27,150కోట్లు హోల్డ్ లో పెట్టింది. ఈ వాస్తవాలు ఉద్యోగులు అందరికీ కూడా తెలియవు. సీపీఎస్ కింద ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా రూ.800కోట్లు కూడా చెల్లించడంలేదు. రూ.2,800కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉంది. దాదాపు 6 నుంచి 7వేలకోట్లు డీఏ ఎరియర్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సింది ఈ ప్రభుత్వం ఎందుకు ఆపిందో చెప్పాల్సిన బాధ్యత పాలకులదే.

రాష్ట్రానికి జీఎస్టీ ఆదాయం పెరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం బాగానే వస్తోంది. 2021-22లో రాష్ట్ర మొత్తం ఆదాయం రూ.లక్షా50వేలకోట్లు అయితే, జీతాలకు రూ.61వేలు కోట్లు మాత్రమేఖర్చుపెట్టారు. రూ.22వేలకోట్లు ఈ ప్రభుత్వం చేసిన అప్పులకు 2021-22సంవత్సరానికి వడ్డీచెల్లించింది. 2022 అక్టోబర్ చివరినాటికి రాష్ట్ర అప్పు రూ.10లక్షల12వేలకోట్లు, టీడీపీ హయాంలో ఈ ప్రభుత్వం ఇచ్చినలెక్కల ప్రకారమే రూ.3లక్షల62వేలకోట్ల అప్పుంది. ఈ ప్రభుత్వం కేవలం మూడేళ్లలోనే రూ.6లక్షల50వేలకోట్ల అప్పులుచేసింది. దానికి వడ్డీకూడా కలిపి రూ.10లక్షల12వేలకోట్ల అప్పు ప్రభుత్వం చేసింది. ఎఫ్ఆర్ బీఎం పరిమితికి మించి రాష్ట్రానికి ఎందుకు అప్పులిస్తున్నారో కేంద్రమే సమాధానం చెప్పాలి. ఇంత అప్పులకు వడ్డీలుకడుతున్న ప్రభుత్వం, ఉద్యోగుల జీతాల విషయంలో మాత్రం ఎక్కడాలేని కాలయాపన చేస్తోంది. ప్రభుత్వ ఆర్థికస్థితిపై పాలకులు తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు ఉన్నాయా..లేదా అనేదానిపై కేంద్రం కూడా ఆలోచనచేయాలి. ఉద్యోగసంఘాలు ప్రభుత్వానికి భయపడకుండా, ఉద్యోగులపక్షాన నిలవాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్యోగసంఘం నేతలు చూపిన ఒరవడి నేడుఎందుకు కనిపించడంలేదు? పిరికితనమా..భయమా అన్నది ఉద్యోగసంఘనేతలు కూడా ఆలోచనచేసుకోవాలి. జయలలిత లాంటి గొప్పవ్యక్తే ఉద్యోగులదెబ్బకు దిగొచ్చారు. జగన్ రెడ్డి ఆమెకంటే గొప్పవాడేమీకాదు. రాయిమీద ఎన్నినీళ్లుపోసినా దానిలో కదలిక లేనట్లే, ఉద్యోగులదుస్థితిపై ఈ ప్రభుత్వంలో కూడా ఎలాంటి చలనం ఉండటంలేదు.”

Advertisements

Advertisements

Latest Articles

Most Read