రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సర్వీసు అధికారులు పాలన గాలికొదిలి రాజకీయాల బాట పడుతున్నారు. గతంలో పదవీ విరమణ చేసినవాళ్లు, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వాళ్లు ఏదో ఒక పార్టీలో చేరి పోటీ చేసిన సందర్భాలున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ట్రెండ్ మారింది. ప్రభుత్వంలో కీలకపెద్దలు చెప్పినట్టల్లా నిర్ణయాలు తీసుకుంటూ వారికి ఇష్టులుగా మారారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన ఓ ఐఏఎస్ మొదటి నుంచీ వైఎస్ కుటుంబంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈయన ప్రకాశం జిల్లాలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ  చేసేందుకు వైసీపీ టికెట్ ప్రయత్నిస్తున్నారట. పోలీసుశాఖలో కీలకపదవిలో వున్న ఐపీఎస్ కూడా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వైసీపీ టికెట్ రేసులో వున్నారట. సీఎంవోలో వుంటూ సీఎం జిల్లా, సామాజికవర్గానికి చెందిన అధికారి కడప జిల్లా నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ కోసం ఇప్పటి నుంచే పోటీ పడుతున్నారు. రాజకీయాలలో ప్రవేశించేందుకు ఇంతగా ఆసక్తి చూపించడానికి గల కారణాలు...వైసీపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే ఇప్పటి అక్రమాలలో భాగమైన తాము కేసుల్లో ఇరుక్కుంటే రాజకీయ పదవులు రక్షణగా వుంటాయనే ఆలోచన ప్రధానమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read