రెండేళ్ల క్రితం ఇదే రోజున టీడీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచిన ప్రజావేదికను ఈ ముఖ్యమంత్రి కూల్చేశాడని, జగన్మోహన్ రెడ్డి దుశ్చర్యను రాష్ట్రమంతా ముక్తకంఠంతో తప్పుపట్టిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథం గా మీకోసం...! " కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) వారు కొత్త నివేదిక విడుదల చేశారు. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2021 వరకు దేశవ్యాప్తంగా ఉన్న విదే శీపెట్టుబడులకు సంబంధించిన నివేదికను కేంద్రం తాజాగా బహిర్గతం చేసింది. ఆ నివేదిక ప్రకారం గడచిన రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు కేవలం రూ.2,114 కోట్లు మాత్రమే. గడచిన రెండేళ్లలో దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో రాష్ట్రానికి వచ్చింది కేవలం 0.34శాతం మాత్రమే. జగన్మోహ న్ రెడ్డి అద్భుతమైన పనితీరుకి కేంద్ర ప్రభుత్వమిచ్చిన నివేదికే నిదర్శనం. ఈ దిక్కుమాలిన ప్రభుత్వ విధివిధానాలతో రాష్ట్రం ఎంతలా నష్టపోయిందో కేంద్ర ప్రభుత్వ నివేదికే చెబుతోంది. గడచిన రెండేళ్లలో మిగతా రాష్ట్రాలకు వచ్చిన విదేశీ పెట్టుబడుల వివరాలను కూడా పరిశీలిద్దాం. గుజరాత్ కు లక్షా81వేలకోట్ల పెట్టుబడులు, మహారాష్ట్రకు లక్షా71వేలకోట్లు, కర్ణాటకకు రూ.87,630కోట్లు, తమిళనా డులో రూ.24,438కోట్లు, అత్యంత వెనుకబడిన జార్ఖండ్ కు రూ.19,800కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పొరుగునున్న తెలంగాణకు రూ.13,482కోట్లు, హర్యానాకు రూ.17,755కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులన్నీ అక్టోబర్ 2019నుంచి మార్చి 2021 మధ్య వచ్చినవే. జార్ఖండ్, హర్యానాల కంటే హీనంగా రాష్ట్రానికి రూ.2,114కోట్లు మాత్రమే విదేశీ పెట్టుబడులు తెచ్చినందుకు ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. రాష్ట్రానికి అదిచేశాము.. ఇదిచేశామని చెప్పుకుంటూ ట్వీట్లు పెడుతున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇప్పుడేం చెబుతాడు? ఏమనిట్వీట్లు పెడతాడు? రెండేళ్లలో మీరు తెచ్చిన విదేశీ పెట్టుబడులు రూ.2,114కోట్లనా? టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలను తన్ని తరిమేసింది కాక, దిక్కుమాలిన జాబ్ కేలండర్ విడుదలచేసి నిరుద్యోగులతో ఆడుకుంటారా? ఒకసారి 2014-19మధ్య డీఐపీపీ వారి నివేదికల ఆధారంగా, గతప్రభుత్వ హాయాంలో చంద్రబాబునాయుడిగారి హాయాంలో రాష్ట్రానికి ఎన్ని విదేశీ పెట్టుబడులు (ఎఫ్ డీఐ) వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం. 2014-15లో రూ.8,326కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.
2015-16లో రూ.10,315 కోట్లు, 2016-17లో రూ.14,767 కోట్లు, 2017-18లో రూ.8,037 కోట్లు, 2018-19లో అత్యధికంగా రూ.23,882 కోట్లు తీసుకు రావడం జరిగింది. మొత్తం 2014 నుంచి 2019 మధ్యన ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొచ్చిన విదేశీ పెట్టుబడులు రూ.65,327 కోట్లు. అంటే టీడీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో సరాసరిన రాష్ట్రానికి ప్రతిసంవత్సరం రూ.13వేల కోట్ల వరకు విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చింది. కానీ నేడు ఈ మూర్ఖపుముఖ్యమంత్రి దానిలో కనీసం పదిశాతం కూడా ప్రతి సంవత్సరం రాష్ట్రానికి విదేశీ పెట్టుడులు తీసుకురాలేక పోతున్నాడు. ఆ మొత్తంపెట్టుబడులన్నీ రాష్ట్రంలో అప్పటికే గ్రౌండ్ అయ్యాయి. పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఆయా కంపెనీలు వాటి కార్యకలాపాలు కూడా ప్రారంభించాయి. అవి కాకుండా ఇతరత్రా ఎంవోయూలు కుదుర్చుకున్నవి అదనం. అలాంటి పరిశ్రమలు చంద్రబాబునాయుడి హాయాంలో కోకొల్లలు. పరిశ్రమలను, పెట్టబడిదారులను ఆహ్వనించడానికి టీడీపీ ప్రభుత్వం ప్రతిసంవత్సరం విశాఖపట్నంలో పార్టనర్ షిప్ సమ్మిట్ నిర్వహించేది. 2019లో అధికారం కోల్పోయే ముందుకూడా చంద్రబాబునాయుడు ఏషియన్ పేపన్ మిల్స్ రూపంలో రూ.24వేలకోట్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకొ చ్చారు. ఆమొత్తం కూడా కలిపితే టీడీపీ హాయాంలో రాష్ట్రానికి వచ్చిన విదేశీపెట్టుబడులన్నీ కలిపితే దాదాపు రూ.90వేలకోట్ల పైబడే ఉన్నాయి. వీటికి విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించిన మూడు పారిశ్రామిక సదస్సుల (పార్టనర్ షిప్ సమ్మిట్స్) ద్వారా ఒప్పందాలు కుదుర్చు కున్న 15.45లక్షలకోట్ల పెట్టుబడులు అదనం. అదీ చంద్రబాబుసమర్థత,సత్తా. రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధా మంగా మార్చారు. జగన్మోహన్ రెడ్డి తన రెండేళ్ల పాలనలో రూపాయి పెట్టుబడి అయినా రాష్ట్రానికి తీసుకొచ్చారా? పారిశ్రామికవేత్తలకోసం ఎక్కడైనా ఒక్క సమ్మిట్ అయినా నిర్వహించారా? ప్రజలు 151 సీట్లతో గెలిపించింది రాష్ట్రాన్ని ఈవిధంగా నాశనంచేయ డానికేనా? విభజన తర్వాత తమ భవిష్యత్ ఏమిటా అని కొట్టుమిట్టాడిన యువ తకు, చంద్రబాబునాయుడు ఆశాకిరణంలా నిలిచారు. ఉద్యోగ,ఉపాధికల్పనలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారు . రాబోయే రోజుల్లో నిరుద్యోగుల పక్షానకూడా నారాలోకేశ్ భారీ ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించబోతున్నారు. విద్యార్థుల పక్షాన పోరాడి, పరీక్షలు రద్దు చేయించినట్టే, నిరుద్యోగుల తరుపున ప్రభుత్వంపై పోరాడి, నారా లోకేశ్ ఉద్యోగాల సాధనకు ఉపక్రమించబోతున్నారు.