పార్లమెంటు సాక్షిగా వైసిపి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అంతా బూటకమేనని కేంద్రం గణాంకాలతో సహా వెల్లడిస్తోంది. తాజాగా ఏపీ సర్కారు డొల్లతనం బయటపడింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2022 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఏపీకి వచ్చిన విదేశీ పెట్టుబడులు కేవలం 0.5 శాతం మాత్రమేనని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా పెట్టుబడుల్లో జగన్ సర్కార్కు పదో స్థానంలో నిలిచింది. రాజ్యసభలో సభ్యులు విదేశీ పెట్టుబడులపై వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. అన్ని రాష్ట్రాలకు మొత్తం 42,509 మిలియన్ డాలర్ల పెట్టుబడి రాగా.. అగ్రస్థానంలో మహారాష్ట్ర, తర్వాత స్థానాల్లో నిలిచిన కర్ణాటక, ఢిల్లీ నిలిచాయి. 1,287 మిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో తెలంగాణ ఉంది. తొమ్మిది నెలల కాలంలో 217 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించిన ఏపీ పదో స్థానంలో నిలిచింది.
ఏపీకి వచ్చిన విదేశీ పెట్టుబడులు ఎంతో తెలిస్తే సిగ్గు పడాలి..
Advertisements