ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ కూడా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవటం ఒక వింతగా చెప్పాలి. మన రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, సోలార్, విండ్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ రేట్ తగ్గించాలని, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఆదేశాలు జరీ చేసిన సంగాతి తెలిసిందే. అయితే ఇప్పటికే 42 విద్యత్ ఉత్పత్తి కంపెనీలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్ట్ కు వెళ్లారు. దీంతో కోర్ట్ ప్రభుత్వ ఉత్తర్వులను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో కేంద్ర సంస్థలు అయిన, ఎన్‌టీపీసీ, ఎస్‌ఈసీఐలు ఇప్పటికే, రాష్ట్ర ప్రభుత్వానికి మేము విద్యుత్ రేట్లు తగ్గించే ప్రసక్తే లేదు, ఒప్పందం రద్దు చేసుకుంటే, ఫైన్ కట్టాలి అని ఏపి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాయి.
అయితే ప్రైవేటు సంస్థలు, కేంద్ర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి అంటే అర్ధం ఉంది. చివరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కూడా, ఇప్పుడు ఏపి రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన, జెన్కో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. సోలార్ రేట్లు తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. సోలార్ విద్యుత్, ఒక యూనిట్ ధరను రూ.2.50 కు తగ్గించాలని, ప్రభుత్వం, అన్ని విద్యుత్ సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ప్రతిపాదనకు ఒప్పుకోమని అన్ని విద్యుత్ సంస్థలతో పాటు, ఇప్పుడు రాష్ట్రం ఆధీనంలో ఉండే జెన్కో కూడా, మేము ఆ ధరకు విద్యుత్ ఇవ్వలేము అంటూ తేల్చి చెప్పాయి. ఈ మేరకు ట్రాన్స్‌కో బోర్డు సమావేశంలో తీర్మానం చేసారు. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి షాక్ అనే చెప్పాలి. సొంత సంస్థలు కూడా ప్రభుత్వాన్ని తప్పు బడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కో అనంతపురం జిల్లాలోని సోలార్ పార్క్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసింది. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలు ప్రకారం, ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఒక్కో యూనిట్ ను, రూ.3.50 కు అమ్మే విధంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం తక్కువకు ఇవ్వమనటంతో, జెన్కో అధికారులు మాత్రం కుదరదు అని చెప్తున్నారు. ఇక్కడ ప్లాంట్ పెట్టటానికి, అయిన ఖర్చుకు, ఒక్కో యూనిట్ ను, రూ.4 కు అమ్మాలని, అయినా మాకు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ రూ.3.50 రేట్ మాత్రమే నిర్ణయించిందని, ఇప్పటికే నష్టాల్లో ఉన్న మాకు, మరింత తగ్గించాలి అంటే, మా వల్ల కాదని, ఏపి జెన్కో, ఏపి ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మరి జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్నయం తీసుకుంటారో.