జీరో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త ఒరవడి సృష్టిస్తుందని ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఐ సి ఆర్ ఏ ఎఫ్ కి చెందిన ప్రపంచ అగ్రోఫారెస్ట్రీ సెంటర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టోనీ సైమెన్స్ ప్రశంసించారు. ఆయనతో పటు ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రవి ప్రభు న్యూయార్క్ లో ముఖ్యమంత్రి తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ముప్ఫయి దేశాల్లో వ్యవసాయ-అటవీ రంగంలో పరిశోధనలు, అభివృద్ధి చేస్తున్న తమ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సేంద్రీయ సేద్యాన్ని ఆసక్తికరంగా పరిగణిస్తుందని డాక్టర్ టోనీ సైమెన్స్ అన్నారు. అభివృద్ధిలోనే పరిశోధన ఉంటుందని.. ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో అది స్పష్టంగా కనిపిస్తోందని ఐ సి ఆర్ ఏ ఎఫ్ అధిపతులు అభిప్రాయపడ్డారు.

cbn 250920108

ఆంధ్రప్రదేశ్ లో కూడా తమ పరిశోధనలు చేయడానికి ఆసక్తిని వారు వ్యక్తం చేసారు. క్షేత్ర స్థాయిలో సవివరమైన, లోతైన వాస్తవ లెక్కలను, వివరాలను ఏపీ లో సంగ్రహించాలని వారు అన్నారు. దీని ఆధారంగా మరింత లోతైన పరిశోధనలు నిర్వహించి ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయవచ్చని ఐ సి ఆర్ ఏ ఎఫ్ అభిప్రాయపడింది. రైతులకు ఇచ్చే శిక్షణ కూడా దీనిలో కీలకమని, ఆ దిశగా ముఖ్యమంత్రి ఆలోచన విధానం సాగడం ఆహ్వానించదగ్గదని ఆ సంస్థ ప్రతినిధులు అన్నారు. పరిశోధన, పరిజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుని ప్రకృతి సేద్యాన్ని పెద్ద ఎత్తున చేపట్టే ఆంధ్రప్రదేశ్ ప్రయత్నంలో తాము భాగస్వామ్యం అవ్వడానికి సిద్దమే అని అగ్రోఫారెస్ట్రీ డీజీ ఆసక్తి వ్యక్తం చేసారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్లోబల్ సెంటర్ ఏర్పాటైన ఆశ్చర్య పడనవసరం లేదనితెలిపారు.

cbn 250920108

మరో పక్క, ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున రిసార్టులను ఏర్పాటు చేయడానికి ప్రతిష్టాత్మకమైన వి-రిసార్ట్ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ సీఈవో అదితి బల్బీర్, మాసివ్ ఎర్త్ ఫండ్ సీఈవో శైలేష్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం ప్రతిబించేలా ఈ రిసార్టులను వినూత్న రీతిలో ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని ప్రొత్సహిస్తున్న ప్రస్తుత తరుణంలో అందుకు తగ్గ రిసార్టులను కూడా అభివృద్ధి చేయవచ్చని ముఖ్యమంత్రి వి-రిసార్ట్ సంస్థకు సూచించారు. ఈ రిసార్టులలో వెల్ నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ విధానంలో రిసార్టులను ఏర్పాటు చేసి, వాటిని విజయవంతంగా నిర్వహించడానికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని సమావేశంలో చర్చించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read