రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకోవటం కొత్తేమి కాదు. కానీ ఆదాయం ఎంత, మనం ఎంత అప్పు తెచ్చుకోగలం, ఎలా తీర్చగలం, దేనికి ఖర్చు చేస్తాం ? తెచ్చుకున్న అప్పులో నుంచి ఆదాయం ఎలా సమకూర్చుకోవాలి అనే అంశాలు ముఖ్యం. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు లక్షా 20 వేల కోట్ల అప్పు చేసారు. అంటే ఏడాదికి 25 వేల కోట్ల అప్పు. ఆ డబ్బులతో అమరావతి నిర్మాణం జరిగింది, పోలవరం నిర్మాణం జరిగింది, సిమెంట్ రోడ్డుల నిర్మాణం, అనేక మౌళిక సదుపాయాలు కల్పిస్తూ అప్పటి ప్రభుత్వం,అప్పుని వినియోగించుకుంది. అయితే అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గోల గోల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పడేసారని, చంద్రబాబు విధానాలతో తీవ్ర నష్టం జరుగుతుందని, భావి తరాలు నష్ట పోతున్నాయని, చంద్రబాబుకి పరిపాలన చేయటం రాదు అంటూ, విపరీతమైన ప్రచారం చేసారు. ఇలా అప్పుల పై ప్రచారం చేసిన జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి రాగానే అప్పులే అప్పులుగా నెట్టుకుని వస్తున్నారు. చంద్రబాబు హాయాంలో 5 ఏళ్ళలో కేవలం లక్షా 20 వేల కోట్లు అప్పు చేస్తే, జగన్ మోహన్ రెడ్డి కేవలం 16 నెలల్లోనే లక్షా 20 వేల కోట్ల అప్పు చేసారు. అంతే కాదు ఈ అప్పు సరిపోవటం లేదు. ఇంకా ఇంకా అప్పులు చేస్తున్నారు. భూములు అమ్మి మరీ, డబ్బులు కోసం ప్రయత్నం చేస్తున్నారు.

jagan 24122020 2

అయితే ఈ అప్పు కూడా సరిపోక పోవటంతో, రకరకాల కొత్త అప్పులు చేస్తున్నారు. అప్పు పుట్టటం కోసం, ప్రజల పై భారాలు వేయటానికి కూడా వెనుకాడటం లేదు. ఆశ్చర్యకరమైన విషయం అయినా, ఇది నిజం. నిన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయం బట్టబయలు అయ్యింది. కేంద్రం నుంచి ఎక్కువ అప్పులు తెచ్చుకోవటం కోసం, రాష్ట్ర ప్రజల పై పన్నులు భారం మోపుతున్నారు. పట్టణ స్థానిక సంస్థల సంస్కరణల పేరుతో, ఆస్తి పన్ను పెంచటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని, గతంలో ఉన్న సర్కిల్ రేట్ కాకుండా, ఆస్తి రేటు ప్రకారం పన్ను వేయనున్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రజల పై అదనపు బారం పడుతుంది. ప్రతి ఏడు ఆస్తి పన్ను పెరుగుతూనే ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రజల పై భారం కంటే కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు పుడుతుంది. నిన్న కేంద్రం ఇచ్చిన ప్రకటన ప్రకారం రూ.2,525 కోట్ల అదనపు అప్పుని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు. ప్రజల పై ఎక్ష్త్రా పన్ను వేసినందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇస్తున్నారు అనమాట. ఇది ప్రజలకు మంచి చేసే నిర్ణయమో, నష్టం చేసే నిర్ణయమో ప్రజలే తేల్చుకోవాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read