గత అయుదు నెలలుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేసుకుని, కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు అంటూ, ప్రతి రోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలే కాదు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను కూడా టార్గెట్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం పై ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే చాలు, వారి పని కూడా పడుతున్నారు. అలాగే రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇసుక కొరత నుంచి, దాడులు దాకా, అన్నీ ఇబ్బందులే. ఈ సమస్యల పై, ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలు, రాజ్‌భవన్ కు వెళ్లి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పై, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సారథ్యంలో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి, ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంలో, గవర్నర్ చేసిన వ్యాఖ్యలతో, టిడిపి నేతలు అవాక్కయ్యారు.
గవర్నర్ ని కలిసిన సందర్భంలో, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ దామోదర్ నాయుడు పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి, ఆయన్ను అరెస్ట్ చెయ్యటం పై, తెలుగుదేశం నేతలు గవర్నర్ ద్రుష్టికి తీసుకువెళ్ళారు. మా పైనే కాదని, చివరకు యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ ను కూడా లోపల వేయటం ఏంటి అంటూ, ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా ఉండే వారు, ఏమైనా చేస్తే, ముందుగా గవర్నర్ కు చెప్పకుండా, గవర్నర్ అనుమతి లేకుండా, కేసు పెట్టి, అరెస్ట్ చెయ్యటం ఏమిటి అంటూ ప్రశ్నించారు. యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ ను అరెస్ట్ చెయ్యటం పై, తక్షణం చర్యలు తీసుకోవాలంటూ, తెలుగుదేశం పార్టీ నేతలు, గవర్నర్ ను కోరారు.
అయితే ఈ సందర్భంలో, గవర్నర్ చేసిన వ్యాఖ్యలతో టిడిపి నేతలు కూడా అవాక్కయ్యారు. వైస్ ఛాన్సలర్ అరెస్టు వార్తను తాను కూడా పత్రికల్లో చూశానని గవర్నర్ చెప్పడంతో తెలుగుదేశం నేతలు అవాక్కయ్యారు. ఈ విషయాన్ని తెలుగుదేశం నేతలు, మీడియాతో పంచుకున్నారు. గవర్నర్ కు తెలియకుండా, ఆయన పరిధిలో ఉన్న అంశాలు కూడా, ఆయనకు చెప్పకుండా జరుగుతున్నాయని అన్నారు. గవర్నర్ అపాయింట్ చేసే, వైస్ చాన్సలర్, ఏమైనా తప్పు చేస్తే, ముందుగా గవర్నర్ కు చెప్పి, ఆయన అనుమతి తీసుకోవాలని అన్నారు. అలాగే గవర్నర్ అనుమతి లేకుండా, చీఫ్ సెక్రటరీకి కూడా చెప్పకుండా, బిజినెస్ రూల్స్ మార్చటం పై కూడా, తెలుగుదేశం నేతలు అభ్యంతరం చెప్తున్నారు. మొత్తానికి, గవర్నర్ కు కూడా తెలియకుండా, ఈ రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయనే అభిప్రాయం కలుగుతుంది.