ఏపిలో ఇప్ప‌టికే అధికారులు వ‌ర్సెస్ మంత్రులు అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారింది. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ కీల‌క నియామ‌కాల‌కు గ‌వ‌ర్న‌ర్ బ్రేక్ వేసినట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఏపి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల కోడ్‌కు ముందుగా ఏపిలో స‌మాచార హ‌క్కు క‌మిష‌నర్ల నియామ‌కానికి సంబంధించి పేర్ల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు ప్ర‌తిపాదించింది. అయితే, ఆ పేర్ల‌ను చూసి గ‌వ‌ర్న‌ర్ ఆమోదించుకుండా పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు ఇది ఏపి ప్ర‌భుత్వంలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఏపి ప్ర‌భుత్వ సిఫార్సులు ఇలా.. ఏపిలో స‌మాచార హ‌క్కు క‌మిష‌నర్ల నియామకానికి సంబంధించి ప్ర‌భుత్వం కొన్ని పేర్ల‌ను ఎంపిక చేసింది. ప్ర‌భుత్వం ఆ పేర్ల‌ను ఆమోదించాలంటూ గ‌వ‌ర్న‌ర్‌కు సిఫార్సు చేసింది.

governor 29042019

అయితే, ప్ర‌భుత్వం సిఫార్సు చేసిన పేర్ల‌ను చూసి గ‌వ‌ర్న‌ర్ ఈ పేర్లు నేను ఆమోదించను అని చెప్పినట్టు స‌మాచారం. ప్ర‌భుత్వం సిఫార్పు చేసిన వారిలో స‌మాచార హ‌క్కు చ‌ట్టం క‌మిష‌న‌ర్‌గా విజ‌య‌వాడ‌లోని ఒక ఇండస్ట్రియలిస్టు పేరు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌తో పాట‌గా రెవిన్యూ స‌ర్వీసు నుండి స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఉద్యోగ సంఘాల నేత‌గా ప‌ని చేసిన ఈ శ్రీరామమూర్డి పేరు ఉన్న‌ట్లు స‌మాచారం. వీరిద్ద‌రి పేర్ల జాబితాను రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్‌కు పంపించి..ఆమోద ముద్ర వేయాల‌ని అభ్య‌ర్దించింది. అయితే, ప్ర‌భుత్వం సిఫార్సు చేసిన పేర్ల‌పైన గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం పూర్తి స్థాయి సంతృప్తిగా లేద‌ని స‌మాచారం. ఏపి స‌మాచార హ‌క్కు క‌మిష‌నర్లుగా ప్ర‌భుత్వం సిఫార్సు చేసిన వారికి ఆ పోస్టుల‌కు అర్హ‌త లేద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

governor 29042019

గ‌తంలో కిర‌ణ్ కుమార్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అప్పుడు సైతం న‌లుగురు పేర్ల‌తో స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్ల పేర్ల‌ను ఆమోదం కోసం ఇదే గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ వద్ద‌కు పంపారు. అయితే, దానిని గ‌వ‌ర్న‌ర్ తిర‌స్క‌రించారు. అర్హ‌త లేని వారి పేర్ల‌ను సిఫార్సు చేసారంటూ ఫైల్‌ను తిప్పి పంపేసారు. అయితే, పూర్తి వివ‌రాల‌తో అవే పేర్ల‌ను తిరిగి నాటి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి స్వ‌యంగా తీసుకెళ్లి వివ‌రించారు. దాంతో, గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ అవే పేర్ల‌ను ఆ త‌రువాత ఆమోదించారు. అయితే, ఇప్పుడు ప్ర‌భుత్వం పేర్ల‌ను సిఫార్సు చేసినా ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా..గ‌వ‌ర్న‌ర్ ఇప్పుడు ఆ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టారు. ఇది ఇలా ఉంటే, సమాచార హక్కు కమిషన్ లను ఎన్నికోవాల్సిన కమిటీలో ప్రతిపక్ష నేత జగన్ కూడా ఉన్నారు. ఏపి ప్రభుత్వం జగన్ ను దాదపుగా 5 సార్లు పిలిచినా, అమరావతి మీద ద్వేషంతో జగన్ ఈ సమావేశాలకు రాలేదు. ప్రతి సారి వాయిదా వెయ్యటంతో, ఒక స్వచ్చంద సంస్థ కోర్ట్ కు వెళ్ళటంతో, ప్రతిపక్ష నేత లేకుండానే, ప్రభుత్వం సమాచార శాఖ కమిషన్ ను ఎంపిక చేసింది. అయితే, ఇప్పుడు గవర్నర్ దీనికి అడ్డుకట్ట వేసారు. ఒక పక్క సిఎస్, మరో పక్క గవర్నర్, మరో పక్క కేంద్రం, ఇంకో పక్క ప్రతిపక్షం, రాష్ట్రంలో పరిపలనే జరగకుండా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read