దేశంలో అన్ని వ్యవస్థలు నాశనం చేస్తున్న నరేంద్ర మోడీ, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వైఖరి పై కూడా అనుమానాలు వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. 31 కేసులు ఉన్న ఒక వ్యక్తి, నిబద్ధతత కలిగిన పోలీసులు పై కంప్లైంట్ చేస్తే, పోలీసుల పైనే చర్యలు తీసుకున్నారు. ఇంకా వింత ఏంటి అంటే, అసలు ఎన్నికల విధులకు సంబంధం లేని, ఇంటిలిజెన్స్ డీజీని బదిలీ చెయ్యటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సియం సహా, ప్రముఖుల బధ్రత చూసే ఇంటిలిజెన్స్ డీజీని ఎందుకు బదిలీ చేసారో ఎవరికీ అర్ధం కాలేదు. కడప, శ్రీకాకుళం ఎస్పీ పై కూడా ఎలాంటి ఆరోపణలు లేవు, కాని వారిని కూడా బదిలీ చేసారు. అయితే, ఎస్పీల విషయంలో ఎలక్షన్ కమిషన్ కు హక్కు ఉంటుంది కాబట్టి, ఎవరూ ఏమి చెయ్యటానికి లేదు.

ec apgvot 27032019

కాని, ఇంటిలిజెన్స్ డీజీ విషయంలో మాత్రం, ఎలక్షన్ కమిషన్ కు హక్కు లేదు అనేది ప్రభుత్వ వాదన. కేవలం విజయసాయి రెడ్డి, జగన్ కోసం, మోడీ ఈ పని చేసారని, అందుకే ఈ విషయం పై కోర్ట్ లోనే తేల్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగం ఆర్టికల్ 324 ఎన్నికల కమీషన్కి ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను మాత్రమే బదిలీ చేసే అధికారాన్ని కట్టబెట్టింది. ఎన్నికల కమిషన్ ఇంటెలిజెన్స్ డిజి నీ ఎన్నికల విధుల కోసం అడగనూ లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అటువంటిది ఎన్నికల విధుల్లో లేని ఇంటెలిజెన్స్ డీజే ని బదిలీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదు ఎన్నికల సంఘం తన పరిధిని అతిక్రమించి మరి ప్రవర్తించింది అనేది ప్రభుత్వ వాదన. ఇదే విషయం కోర్ట్ లో పిటీషన్ వేసారు. ఈ కేసు రేపు హైకోర్ట్ లో రానుంది.

ec apgvot 27032019

అయితే, తమ హక్కులు ఎలక్షన్ కమిషన్ ఎలా భంగం కలిగిస్తుంది అంటూ ఏపి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్‌ 721ను విడుదల చేసింది. ఇది పాత జీవోనే అని, దీన్ని మరోసారి రిలీజ్ చేసామని అంటున్నారు. దీని ప్రకారం, ఇంటిలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర రావు బదిలీని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ఇంటిలిజెన్స్ డీజీ పోస్టు ఈసీ పరిధిలోకి రానందున ఆయన బదిలీ ఉత్తర్వులను రద్దు చేశారు. అయితే కడప, శ్రీకాకుళం ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొత్త జీవోను జారీ చేశారు. దీంతో, మోడీ, జగన్ చెప్పినట్టు ఆడుతున్న ఎన్నికల కమిషన్ పై, ఏపి ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది అంటూ విశ్లేషకులు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read