పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖా సహయమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ నిన్న రాజ్యసభలో ఒకప్రశ్నకు సమాధానం చెబుతూ, ఆక్సిజన్ అందక కో-వి-డ్ సందర్భంలో మరణించిన వారు దేశంలో ఎవరూ లేరనడంతో దేశ ప్రజానీకమంతా ఆశ్చర్యపోయిందని, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా మీకోసం...! ఏపీలో అనేక ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక కో-వి-డ్ బాధితులు ప్రాణాలు కోల్పోగా, రాష్రాల నుంచి తమకు అలాంటి సమాచారం రాలేదని కేంద్రమంత్రి చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల, అనేక జిల్లాల్లోని అనేక ఆసపత్రుల్లో ఆక్సిజన్ సకాలంలో అందక చనిపోయిన వారిని అందరం చూశాము. తిరుపతి రుయా ఆసుపత్రిలో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి వల్ల, ఆక్సిజన్ ట్యాంకర్ సకాలంలో ఆసుపత్రికి చేరుకోకపోవడంతో నిమిషాల వ్యవధిలోనే 30మంది చనిపోయారు. ఆనాడు జరిగిన ఘటన ఇంకా కళ్లముందు నుంచి చెదిరిపోలేదు. రుయా ఘటనతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు జరిగాయి. వాటికి సంబంధించిన కథనాలు పత్రికలు, ఇతర ప్రసార మాథ్యమాల్లో వచ్చాయి. ఆక్సిజన్ కల్లోలం – కర్నూలు ఆసుపత్రిలో రెండ్రోజుల్లో 9మంది మృతి అన్న వార్త, ఊపిరి ఆగింది - ఆక్సిజన్ అందక 16మంది మృతి, అనంతపురం జిల్లాలో మే2, 2021 నాటి కథనం. ఇలా అనేక కథనాలు మనముందు కనపడ్డాయి. విజయనగరం జిల్లాలోని జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ లో అంతరాయం ఏర్పడి, కలకలం రేగిన ఘటన కూడా మర్చిపోలేదు. ఈ విధంగా అనేక ఘటనలు కళ్ల ముందు కనిపిస్తుంటే, కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి ఏవిధంగా మాట్లాడారో తెలియడం లేదు. కేంద్రమంత్రి ప్రకటనతో తమవారిని కోల్పోయిన కో-వి-డ్ బాధితుల కుటుంబాలకు చెందిన వారు నిర్ఘాంతపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ఆక్సిజన్ అందక ఏపీలో అంతమంది చనిపోయినా కూడా, మృతుల కుటుంబాలకు పైసా పరిహారం కూడా ఇవ్వలేదు. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు గతంలో ఒక తీర్పు ఇచ్చింది. తీర్పులో సెక్షన్ 12 లోని డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ని ప్రస్తావించారు.

తీర్పుని గమనించినట్టయితే జూన్ 30, 2021 న సుప్రీం న్యాయమూర్తులు చాలా స్పష్టంగా చెప్పారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడమనేది కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. కానీ ఈ నాటికీ కూడాప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరణించిన కో-వి-డ్ మృతుల కుటుంబాలకు పైసా పరిహారం కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు. గత మే-జూన్ మాసాల్లోనే సాధారణ మరణాలకంటే అధికంగా లక్షా68వేల మరణాలు నమోద య్యాయని కూడా కేంద్ర జననమరణాల విభాగం చెప్పింది. ఏప్రియల్, మే, జూన్ నెలల్లోనే 2లక్షల5వేల518 మంది మరణించినట్లు సదరు విభాగం చెప్పింది. సాధారణంగా ఒక్కోనెలలో 30నుంచి 35వేల మరణాలు ఏటా నమోదైతే, ఈ సంవత్సరంలోమాత్రం మే-జూన్ మాసాల్లో లక్షా 68వేల మరణాలు అత్యధికంగా నమోదయ్యాయని కూడా అనేక పత్రికల్లో కథనాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారమే మరణాలు లక్షల్లో ఉంటే, ఏపీలో మాత్రం వాటి సంఖ్యను కొన్నివేలల్లో చూపారు. కో-వి-డ్ మృతులకు ఎక్కడ పరిహారం ఇవ్వాల్సి వస్తుందోనన్న నీచ బుధ్ధితోనే జగన్ ప్రభుత్వం కో-వి-డ్ మరణాలను తొక్కిపెట్టింది. ఆక్సిజన్ అందక మరణాలు సంభవించిన ఘటనల్లో బాధ్యు లపై ప్రభుత్వం ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు? కేంద్ర ఆరోగ్యశాఖకు తప్పుడు సమాచారమిచ్చి, పరిహారం ఇవ్వకుండా తప్పించుకోవాలని చూస్తున్న ప్రభుత్వం, మరో పక్కన మూడు నెలల కాలంలోనే 2లక్షల05వేలమంది ఈ ఏడాది కో-వి-డ్ కారణంగా చనిపోతే, ఆ మరణాలను కూడా దాచేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read