ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి రోజు రోజుకీ గడ్డు పరిస్థితిలోకి జారి పోతుంది. ప్రతి రోజు డబ్బులు వెతుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. బయట అప్పులు తెస్తున్నా, అవి ఏ మాత్రం సరిపోవటం లేదు. లెక్కలు అడుగుతుంటే, సరైన లెక్కలు ఉండటం లేదు. మొన్నటి వరకు పత్రికల్లో కధనాలు వస్తే, అది కాదు ఇది అని చెప్పే వారు. ఇప్పుడు అది కూడా లేదు. పత్రికల్లో వచ్చే వాటికి క్లారిటీ ఇచ్చే వాళ్ళు లేకపోవటంతో, అదే నిజం అని నమ్మే పరిస్థితి. అయినా ప్రభుత్వం లెక్క చేయటం లేదు. ప్రస్తుతం ఒక నెల రోజులు నుంచి, మరో కొత్త ఎత్తుగడకు ప్రభుత్వం తెర లేపింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కార్పొరేషన్ల సొమ్ములు అన్నీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సు కార్పొరేషన్ కు బదిలీ చేసి అందులో డిపాజిట్ చేయాలని కోరుతుంది. ఇప్పటికే పంచాయతీ నిధులు లాగేసారు. తరువాత విద్యా సంస్థల నిధులు లాగేసారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి చెందిన 400 కోట్ల రూపాయాలు లాగేసారు. తాజాగా ప్రభుత్వం కన్ను ఆర్టీసి పైన పడింది. ఇప్పటికే ఆర్టీసిని ప్రభుత్వ పరం చేయటంతో, వాటి ఆస్తుల పైన ప్రభుత్వం కన్ను పడిందని, గతంలోనే అనేక కధనాలు వచ్చాయి. అయితే ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తుల జోలికి వెళ్ళే సాహసం అయితే ఇప్పటి వరకు చేయలేదు.

rtc 20122021 2

తాజాగా ఆర్టీసి పీఎఫ్ ట్రస్ట్ లో ఉన్న దాదాపుగా రూ.1,600 కోట్లకు టెండర్ పెట్టింది. ఆ సొమ్ము మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సు సర్వీసెస్ కార్పొరేషన్ లోకి డిపాజిట్ చేయాలని ఆర్టీసిని కోరింది. అయితే దానికి ఆర్టీసి యాజమాన్యం ఒప్పుకోవటం లేదు. ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసామని, ఆ ట్రస్ట్ లో నుంచి డబ్బులు తీయటం కుదరదని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని పధకాలు, అలాగే సంస్థల్లో మాత్రమే, ఈ డబ్బు పెట్టుబడి పెట్టాలని, అలాంటి వాటికే ఇవి ఉపయోగించాల్సి ఉంటుంది, రూల్స్ చెప్తున్నాయని, ప్రభుత్వానికి చెప్పారు. అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆ డబ్బులు ఎలా లాగేయాలి అనేది ఆలోచన చేస్తుంది. అయితే ప్రభుత్వం ఇలా మొత్తం అన్ని కార్పొరేషన్ల నుంచి ఊడ్చి పడేస్తూ, డబ్బులు లాక్కోవటం పై విమర్శలు వస్తున్నాయి. ఆయా సంస్థల్లో ఉద్యోగులు గత కొన్నేళ్లుగా దాచుకున్న సొమ్ము పై ప్రభుత్వం కన్ను పడటం దారుణం అని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read