ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా దూకుడుగా ఉండాలి అనుకున్నారో, చంద్రబాబు ఈ మధ్య అలాగే ఉంటున్నారు... మాది ధనిక రాష్ట్రం, మాకు ఆంధ్రప్రదేశ్ తో పోలిక ఏంటి అంటూ డాంబికాలు పోయిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, మన ఆంధ్రప్రదేశ్ కరెంటు వాడుకుని, మనకి బాకీ ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయాడు... మానకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, బిల్డ్ అప్ ఇస్తూ, బయట తిరుగుతూ, ఫోజులు కొడుతున్న సంగతి తెలిసిందే... దేశంలోనే రిచ్ స్టేట్ అని డబ్బా కొట్టుకుంటూ, మన సొమ్ము ఇప్పటికీ లాక్కుని బ్రతుకుతున్న తెలంగాణా సంస్థ పై దూకుడుగా ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

telangana 20012018 2

భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా, ఒక ప్రభుత్వ సంస్థ, మరొక ప్రభుత్వ సంస్థ నుండి తన బకాయిలను తిరిగి పొందడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) వద్దకు వెళ్లి, ఆ సంస్థ పై దివాలా ప్రక్రియ ప్రారంభించి, ఆస్తులు జప్తు చేసి, మా బాకీ మాకు తీర్చేలా చెయ్యండి అంటూ, పిటీషన్ వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ... ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పోరేషన్ (ఎపి జెనోకో), తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థను ట్రిబ్యునల్ కు లాగడంతో దివాలా ప్రక్రియ ప్రారంభించి, రూ.3,700 కోట్ల రాబట్టాలని చూస్తుంది..

telangana 20012018 3

దివాలా తీర్మానం ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ, 2016 సెక్షన్ 9 ప్రకారం, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ ముందు ఎపి జెన్కో తన పిటిషన్ దాఖలు చేసింది. మూడున్నర సంవత్సరాల పాటు మన కరెంటు వాడుకుని, 4 వేల కోట్లు బకాయలు పడి, డబ్బులు అడిగితే మన రాష్ట్రానికి ఎగ్గొట్టి, మాది రిచ్ స్టేట్ అంటూ డబ్బా కొట్టుకుంటూ ఊరు ఊరు తిరుగుతున్న కెసిఆర్ కి, కెసిఆర్ కొడుక్కి, ఇప్పటికైనా బుద్ధి వచ్చి, మన డబ్బులు ఇస్తారో, లేక ఆస్తులు జప్తు చేసుకుని, మనకు బాకీ తీరుస్తారో చూద్దాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read