ఈ రోజు హైకోర్టులో, ఏపి ప్రభుత్వానికి, ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు హైకోర్టులో ఎయిడెడ్ స్కూల్స్ తో పాటు, కాలేజీలకు సంబంధించి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆపివేస్తాం అంటూ, ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న బెదిరింపులతో పాటుగా, స్కూల్స్ ని అప్పగించాలని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల పై, ఈ రోజు విచారణ జరిగింది. దాదాపుగా, ఈ అంశం పై 25 పిటీషన్లు, ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఈ కేసులు మొత్తం కూడా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ధర్మాసనం, ఈ రోజు ఈ అన్ని కేసులు పై విచారణ చేసింది. ఈ విచారణ సందర్భంగా, హైకోర్టులో కేసులు విచారణ జరుగుతున్నా కూడా, ఎయిడెడ్ స్కూల్స్ ని వెంటనే యాజమాన్యాలు తమకు అప్పగించాలని, వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని అని చెప్పి, న్యాయవాదులు నర్రా శ్రీనివాస్, శ్రీవిజయ్, సుబ్బారావులు ఈ అంశం పై హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. విల్లింగ్‌ ఇవ్వలేదని, అంగీకారం తెలపలేదని, ఎయిడెడ్ స్కూల్స్ లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆపటానికి వీలు లేదని చెప్పి, స్పష్టమైన ఆదేశాలను హైకోర్టు ఇచ్చింది. అదే విధంగా హైకోర్టులో కేసులు ఉన్నంత వరకు ఎయిడెడ్ స్కూల్స్ పై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

hc 04102021 2

ఈ రెండు అంశాల పై కూడా తాము ఎటువంటి చర్యలు తీసుకోబోమని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను హైకోర్ట్ రికార్డు చేసింది. దీంతో పాటుగా, ఎయిడెడ్ స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, వాటి పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తో పాటుగా, రీజినల్ జాయింట్ డైరెక్టర్లకు, జిల్లా విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని, హైకోర్టు సూచించింది. ఈ నెల 22వ తేదీలోపు కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పి, ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఈ కేసు విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. విద్యా శాఖకు సంబందించిన అంశం కాబట్టి, దీని ప్రాధాన్యత క్రమంలో వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని కూడా, హైకోర్టు ధర్మాసనం అభిప్రాయ పడింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి, ఈ కేసు తేలే వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విజయవాడలో ఏడు దశాబ్దాల చరిత్ర ఉన్న, మాంటిసోరీ స్కూల్, ఇదే అంశం పై మూతపడిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయం పై,అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read