ఆంధ్రప్రదేశ్ లో ఫ్రంట్ లైన్ వారయిర్స్ గా ఉన్న డాక్టర్లకు, సరైన సౌకర్యాలు కల్పించాలని, విధి నిర్వహణలో చనిపోయిన డాక్టర్స్ కి నష్ట పరిహారం చెల్లించాలని, కుటుంబాలకు కూడా దూరంగా ఉంటూ, ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం ఈ రోజు తెలిపింది. తమకు ఇవ్వాల్సిన రీతిలో ప్రభుత్వం, మాకు సహకారం అందించటం లేదని, వాపోయారు డాక్టర్లు. ప్రభుత్వం డాక్టర్స్ అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ జయధీర్ ఈ రోజు పత్రికా సమావేశం పెట్టి, రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే, ఈ సమయంలో కూడా తాము సహాయ నిరాకర్నా చెయ్యటానికి వెనకాడమని అన్నారు. క-రో-నా తో పోరాడుతూ, వై-రస్ సోకిన వారికి వైద్యం చేస్తుంటే, తమను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు. తాము గత మూడు నెలలుగా ఈ విషయం పై ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు అయిదుగురు డాక్టర్లు చనిపోయారని, అయితే ఈ రోజు వరకు వారికి ఎలాంటి పరిహారం అందలేదని, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని అన్నారు. పోయిన సారి, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, 50 లక్షలు ఇన్సురన్సు ఇవ్వమని అడిగితె, చేస్తాం అన్నారు కాని, ప్రభుత్వం మాత్రం ఇవ్వలేదు.
పక్కన ఉన్న తెలంగాణాలో మాత్రం, మొన్న ఒక డాక్టర్ చనిపోతే, 50 లక్షలతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చారని అన్నారు. అలాగే ఢిల్లీలో కూడా కోటి రూపాయలు ఇచ్చారని, ఇలాంటి మానవత్వా సహాయం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం వైద్యులుగా ఇంత మంది వైద్యులు చనిపోతున్నా, ఇప్పటి వరకు వైద్యం చెయ్యలేం అని అనలేదని అన్నారు. అలాగే మా వల్ల, మా కుటుంబ సభ్యులకు క-రో-నా వస్తే, వారికి ఒక బెడ్ ఇవ్వాలని, లేదా పక్క రాష్ట్రాలు వైద్యం కోసం వెళ్తే, రీయింబర్స్మెంట్ ఇవ్వాలని అన్నారు. 2006 జీతాలు ప్రకారం, కేవలం 60 వేలు ఇస్తున్నారని, ఇవన్నీ మారాలని అన్నారు. బయటకు మాత్రం, డాక్టర్లకు ఇంత చేస్తాం , అంత చేస్తాం అంటున్నారని, కానీ బయటకు మాత్రం జరుగుతుంది వేరు అని అన్నారు. రేపటి నుంచి ఉద్యమ కార్చరణ ప్రకటిస్తున్నాం అని, రేపటి నుంచి, రెండు రోజుల పాటు కొవ్వుత్తుల ర్యాలీ చేస్తాం అని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే, ఇక భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం అని అన్నారు. అలాగే న్యాయ పోరాటం కూడా చేస్తాం అని అన్నారు. ఇప్పటి వరకు చనిపోయిన డాక్టర్లకి, ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వలేదని అన్నారు. అయితే శుక్రవారం, వైద్య శాఖ పై సమీక్ష ఉందని, ఆ సమీక్షలో ఈ డిమాండ్ల పై ఒక నిర్ణయం తీసుకునే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది.