ఎమిరేట్స్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎమిరేట్స్, దుబాయ్ నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (D NATA) చైర్మన్ షేక్ అహ్మద్ బీన్ సయీద్ అల్ మక్దూమ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు... ఈ సమావేశంలో యుఏఈలో భారత రాయబారి నవ్‌దీప్ సూరి కూడా పాల్గున్నారు... హైదరాబాద్ నుంచి తొలి ఎమిరేట్స్ విమాన సర్విసును ఆరంభించడానికి, ఆ తరువాత భారత్ అంతా తమ సర్వీసులను విస్తరించడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి సీయంగా ఉన్న చంద్రబాబు తమకు ఎలా సహకరించిందీ షేక్ అహ్మద్ సయీద్ అల్ మక్దూమ్ గుర్తు చేసుకున్నారు..
ఏపీ, అమరావతికి తమ సర్వీసులను ఆరంభించడానికి ఎమిరేట్స్ సన్నాహాలు చేస్తున్నామని, అయితే భారత ప్రభుత్వ నియమ నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయని వివరించారు.. భారత ప్రభుత్వం ఈ నిబంధనలను సడలిస్తే వెంటనే తమ సర్వీసులను నడపడానికి ఇబ్బంది ఉండబోదని తెలిపారు... భారత్ నుంచి దుబాయ్ రావడానికి ఇప్పుడు కేటాయిస్తున్న సీట్ల సంఖ్య పరిమితంగా ఉన్నాయని, పాత అగ్రిమెంటును భారత ప్రభుత్వం సవరించాల్సిన అవసరం ఉందని చెప్పారు... అమరావతి సందర్శించాలని మక్దూమ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు...
ఇదే సందర్భంలో, ఎమిరేట్స్ గ్రూపుతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది... ఒప్పందం ప్రకారం ఉభయులు కలిసి వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేసుకుంటారు... ఏరోస్పేస్ సంబంధిత మౌలిక సదుపాయాలు, తయారీ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటిల్లో ఎమిరేట్స్ పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను పరిశీలిస్తారు. ... ఒప్పందం ప్రకారం ఏపీలో మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (ఎమ్ఆర్ఆర్) సదుపాయాన్ని ఏర్పాటుచేస్తారు. ఏవియేషన్ శిక్షణ కోసం ఒక అకాడమీని కూడా నెలకొల్పుతారు. ... అలాగే, ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీ, విమానాల ఇంటీరియర్, డ్యూరబుల్స్ తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తారు.... ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఏపీలో నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం పెంపునకు కృషిచేస్తారు....