ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల పై, రేపు సుప్రీం కోర్టులో ఏమి జరుగుతుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో, సుప్రీం కోర్టులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరపవద్దు అంటూ, రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు తీర్పు సస్పెండ్ చేయమని సుప్రీం కోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ కేసుని జస్టిస్ లావు నాగేశ్వరరావు బెంచ్ ముందు లిస్టు కూడా చేసారు. అయితే ఉద్యోగ సంఘాలు కూడా మరో కేసు విడిగా వేసారు. ఈ కేసు కూడా రేపు సుప్రీం కోర్టులో లిస్టు అయ్యింది. ఈ కేసుని జస్టిస్ సంజయ్ కిషన్‍కౌల్ ధర్మాసనం ముందు లిస్టు చేసారు. ఉద్యోగ సంఘాల తరుపున పిటీషన్ వేసిన శ్రీధర్ రెడ్డి, తాను అంతకు ముందు జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆఫీస్ లో పని చేసానని, ఈ ఉద్యోగులు పిటీషన్ ఆయన బెంచ్ ముందుకు వెళ్తే, నాట్ బిఫోర్ మీ అని ఆయన అంటే, మరింత ఆలస్యం అవుతుందని ఆయన తెలిపారు. దీంతో, ఈ పిటీషన్ ను, జస్టిస్ లావు నాగేశ్వరరావు బెంచ్ ముందు కాకుండా, జస్టిస్ సంజయ్ కిషన్‍కౌల్ ధర్మాసనం ముందు లిస్టు చేసారు. దీంతో నిన్న ప్రభుత్వం వేసిన పిటీషన్ ను కూడా, జస్టిస్ లావు నాగేశ్వరరావు బెంచ్ నుంచి తీసి, జస్టిస్ సంజయ్ కిషన్‍కౌల్ ధర్మాసనం ముందు రీ లిస్టు చేసారు.

sc 24012021 2

దీంతో అటు ప్రభుత్వం వేసిన పిటీషన్, అలాగే ఉద్యోగులు వేసిన పిటీషన్ కూడా, జస్టిస్ సంజయ్ కిషన్‍కౌల్ ధర్మాసనం ముందు రేపు విచారణకు రానుంది. దీంతో రేపు ఎలాంటి ఆదేశాలు సుప్రీం కోర్టు ఇస్తుందో అనే అంశం ఇప్పుడు రాష్ట్రం మొత్తం సస్పెన్స్ గా మారింది. ఇక ఈ రోజు హైకోర్టులో కూడా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు హైకోర్టులో అత్యవసరంగా విచారణ జరపాలి అంటూ, ఒక హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు అయ్యింది. 2019 ఎన్నికల జాబితా ప్రకారం ఎన్నికలు జరుపుతాం అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటుందని, 2021 ఎన్నికల జాబితా ప్రకారమే అన్నికలు జరపాలని, దీని వల్ల 3.60 లక్షల మంది ఓటు వేసే హక్కు కోల్పోతున్నారు అంటూ, హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు కాగా, ఆ పిటీషన్ ని హైకోర్టు తిరస్కరించి, రేపు రెగ్యులర్ పిటీషన్ గానే దీన్ని విచారణ చేస్తామాని హైకోర్టు చెప్పింది. అయినా ఈ పిటీషన్ కనుక హైకోర్టు సీరియస్ గా తీసుకుంటే, దెబ్బ పడేది ప్రభుత్వానికే. నిన్న ప్రెస్ మీట్ లో ఎన్నికల కమిషన్, ఈ విషయం పై తాము ఎన్ని సార్లు చెప్పినా, ప్రభుత్వం రెడీ చేయలదనే చెప్పారు. జాప్యానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ కారణంతో ఎన్నికలు ఆపటం అనేది, అవుతుందో లేదో రేపు కానీ తెలియదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read