మన రాష్ట్రానికి జరిగిన అన్ని అవమానాలకంటే, ఇది ఎంతో దారుణమైనది. డబ్బులు మన ఎకౌంటులో వేసి మరీ వెనక్కు తీసుకున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని ఈ సంఘటన గురించి, చంద్రబాబు నేషనల్ మీడియాతో చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. వెనుకబడిన జిల్లాలకు రావలసిన 350 కోట్ల నిధులు గురించి పార్లమెంట్ లో నిలదీశారు తెలుగుదేశం ఎంపీలు. వెనుకబడిన జిల్లాల కోసం గతంలో విడుదల చేసిన రూ.350 కోట్లకు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు రాలేదని, అందుకే ఆ సొమ్మును వెనక్కు తీసుకున్నామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పొన్ రాధాకృష్ణన్ సమాధానమిచ్చారు.
ఫిబ్రవరి 4 నుంచి మా ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన మొదలు పెట్టారు... ఫిబ్రవరి 9న వెనుకబడిన ప్రాంతాలకి, కేంద్రం 350 కోట్లు ఇచ్చింది... ఇది తెలుసుకున్న ప్రధాని కార్యాలయం, ఫిబ్రవరి 15న RBIతో చెప్పి, వేసిన డబ్బులు వెనక్కు తీసుకున్నారు... ఇలా డబ్బులు వేసి మరీ, వెనక్కు తీసుకోవటం ఎక్కడన్నా చూసారా ? ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం తెలియచేసే సంఘటన... డబ్బులు మన ఎకౌంటు లో వేసి, ప్రధాని వద్దు అన్నారని మళ్ళీ వెనక్కు తీసేసుకున్నారు అంటే, వీరు ఎలాంటి వారో అర్ధమవుతుంది...
అయితే మోడీ ఈ డబ్బులు ఇవ్వకపోవటంతో, మన రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాల్లో పనులు ఆగిపోకుండా, చంద్రబాబు అందరినీ ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకున్నారు. మన విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన హక్కు, మోడీ ఇవ్వకపోయినా, చంద్రబాబు మాత్రం చూస్తూ కూర్చోలేదు. వెనుకబడిన 7 జిల్లాలకు 350 కోట్లు, రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చారు. ఆ జిల్లాలలో మొదలు పెట్టిన పనులు ఆగిపోకుండా, ఈ డబ్బులు ఇచ్చి, వెనుకబడిన 7 జిల్లాలకు సపోర్ట్ ఇచ్చారు. మోడీ ఇవ్వకపోయినా, చంద్రబాబు మాత్రం, ఎక్కడా కాంప్రోమైజ్ అవ్వకుండా, వారిని ఆడుకున్నారో. ఇప్పటికైనా మోడీ లాంటి వారు మన బాధ ఆలకిస్తారేమో ఆశిద్దాం...