పోలవరం ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి కేంద్రం దగ్గర నిలిచిపోయిన ఆకృతుల కు త్వరితగతిన ఆమోదం లభించేలా ప్రయత్నించాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబా బునాయుడు ఆదేశించారు. అలాగే పెండింగ్ డిజైన్లు అన్నింటి నీ సిద్ధం చేసి, తుది అనుమతుల కోసం కేంద్రానికి ఆగస్టులోగా పంపాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగ తిపై సోమవారం సచివాలయంలో 67వ సారి ముఖ్యమంత్రి వర్చువల్ రివ్యూ నిర్వహించారు. నిరాటంకంగా కురుస్తున్న వానలతో కాంక్రీట్ – తవ్వకం పనులకు ఆటంకం కలుగుతోందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటివరకు 56.53 శాతం పూర్తయిందని తెలిపారు. మొత్తం పనుల్లో తవ్వకం పనులు 76.20శాతం , కాంక్రీట్ పనులు 30.10శాతం చేపట్టినట్టు వివరించారు.
కుడి ప్రధాన కాలువ 90 శాతం ఎడమ ప్రధాన కాలువ 62.15 శాతం నిర్మాణం పూర్త య్యిందని, అలాగే రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.44శాతం, కాఫర్ డ్యాం జెట్ గ్రౌం టింగ్ పనులు 93శాతం చేపట్టినట్టు వెల్లడించారు. గత వారం స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలట్ చానల్, లెప్ట్n ప్లnాంక్ తవ్వకం పనులు 1.60 లక్షల క్యూబిక్ మీటర్ల మేర చేపట్టగా, స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు 30 వేల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం 1,115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకు 850 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి.
స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్‌కు సంబంధించి మొత్తం 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా ఇప్పటికి 11.08 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 18 వేల మెట్రిక్ టన్నులకు 11,060 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయ్యాయి. నాగావళి – వంశధార అనుసంధానానికి ఇంకా అవసరమైన 320 ఎకరాల భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అడవిపల్లి లిప్ట్ – కుప్పం బ్రాంచ్ కెనాల్ ఈ నెలాఖరుకు, నెల్లూరు బ్యారేజ్ – సంగం బ్యారేజ్ ఆగస్టు చివరి నాటికి, మల్లెమడుగు రిజర్వాయర్ ఈ ఏడాది అంతానికి పూర్తవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరోవైపు ఈ నాలుగేళ్లలో ‘నీరు – ప్రగతి’ కార్యక్రమం కింద 8,10,003 పంటకుంటలు, 88,403 చెక్ డ్యాంలు నిర్మించినట్టు చెప్పారు.