ఎవరు చెప్పినా వినని ఆంధ్రప్రదేశం ప్రభుత్వం, మూడు రాజధానుల దిశగా ముందడుగులు వేస్తుంది. మూడు రాజధానులు అమలు చేయాలని నిర్ణయానికి కట్టుబడి తదనుగుణంగా కార్యచరణ చేపట్టింది. ఇటీవలే మూడు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిని విస్తరించింది. ఈ క్రమంలో న్యాయ రాజధానిగా కర్నూలును సంసిద్ధం చేస్తుంది. శాసన రాజధాని అమరావతిలో,పరిపాలనా రాజధాని విశాఖపట్టణంలో, న్యాయ రాజధానిగా కర్నూలును చేస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా, అభివృద్ధి వికేంద్రీకరణ కాకుండా, పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ చేయడం ద్వారా రాష్ట్రమంతటా సమతుల్యంగా అభివృద్ధి జరుగుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. అదే విషయాన్ని బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా జగన్ స్పష్టం చేసారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఓటింగ్ లో ఆమోదించ బడిన ఈ బిల్లును శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి పంపించారు. రాజకీయంగా సంచలనం సృ ష్టించిన ఈ పరిణామాన్ని జగన్ తీవ్రం గానే తీసుకుంది.
తన నిర్ణయానికే ఎదురు తిరగరాని, దాంతో ఈ క్రమంలో శాసనసభ ఏకంగా మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ బిల్లు కేంద్రం పరిశీలనలో ఉంది. మరో పక్క ఈ మూడు రాజధానుల పై రైతులు హైకోర్టులో ఫిర్యాదు చేసారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రాజధానిలో కార్యాలయాలను వేటిని తరలించవద్దని స్పష్టం చేసింది. అలా చేస్తే ఆ ఖర్చుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుం దని భావించారు. అయితే ఈ క్రమంలో రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను వెలగపూడి సచివాలయం నుంచి కర్నూలుకు తరలించాలని, రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి ఆదేశాలు జారీ చెయ్యటం సంచలనంగా మారింది. ఇకపై ఆ రెండు కార్యాలయాలు కర్నూలు నుంచి పనిచేస్తాయి. ఈ రెండు కార్యాలయాలు మరో వారం రోజులలోపు తమ కార్యాలయాల కార్యనిర్వహణను కర్నూ లు నుంచి మొదలు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు.
శుక్రవారం అర్ధరాత్రి ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ ఉత్తర్వులను ఇచ్చారు. ఈ రెండు విభాగాల అధికా రులు ఇప్పటికే కార్యాలయాల ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారంటున్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు దిశలో భాగంగా ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకుందంటున్నారు. ఇందుకు న్యాయవరంగా ఎటువంటి కోర్టు దిక్కారణ వంటి అంశాలు తలెత్తకుండా న్యా యనిపుణుల సలహాలను తీసుకుని ఈ చర్యను చేపట్టినట్లు చెబుతున్నారు. అయితే ఒక పక్క కోర్ట్ స్పష్టంగా, ఏ ఒక్క కార్యాలయం తరలించవద్దు అని ప్రభుత్వానికి చెప్పి, ఖర్చులు మీ నుంచే వసూలు చేస్తాం అని చెప్పినా, ప్రభుత్వం మాత్రం కోర్ట్ ని కూడా పట్టించుకోవటం లేదు అనే వాదన వినిపిస్తుంది. మరి కోర్ట్, ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో చూడాలి.