తల్లిదండ్రులకు, పిల్లలకు ఆప్షన్ ఇవ్వకుండా, మీరు ఇంగ్లీష్ మీడియం చదవాల్సిందే, తెలుగు మీడియం ఉండదు అంటూ, ఒక తెలుగు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, గత ఆరు నెలలుగా రచ్చ జరుగుతూనే ఉంది. మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టండి, గతంలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూల్స్ లో ఉంది, కాకపోతే, ఏ మీడియంలో చదువుకోవాలో ఆ స్వేఛ్చ తల్లిదండ్రులకు, పిల్లలకు ఇవ్వండి, అంటూ ఎంత మంది చెప్తున్నా, ప్రభుత్వం మాత్రం వినకుండా తెలుగు మీడియం ఉండదు, కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది అంటూ, దూకుడుగా వెళ్తుంది. అయితే, ప్రభుత్వానికి, ఎందుకు ఇంత మొండి పట్టుదల, ఆప్షన్ ఇవ్వటానికి, ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. రాజ్యంగంలో కూడా, మాతృభాషలో నేర్చుకోవటం హక్కు అని చెప్తున్నా, ప్రభుత్వం మాత్రం, రాజ్యాంగాన్ని కూడా లెక్క చెయ్యటం లేదు. సాక్షాత్తు వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు కూడా, ఈ విషయం పార్లమెంట్ లో చెప్పారు.
సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నా, జగన్ ప్రభుత్వం మాత్రం, తెలుగు మీడియం అసలు మేము ఆప్షన్ పెట్టం, అందరూ మేము చెప్పినట్టు ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే చదవాలి అంటూ, ఆదేశాలు ఇచ్చింది. అయితే, దీని పై కొంత మంది కోర్ట్ కు వెళ్ళటంతో, హైకోర్ట్ లో కూడా ప్రభుత్వానికీ వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఏ భాషలో చదువుకోవాలో, తల్లిదండ్రుల ఇష్టానికే వదిలి పెట్టాలని కోరారు. తమ ఆదేశాల్లో అదే చెప్పారు. అయితే కిందపడ్డా తనదే పైచేయి అంటుంది జగన్ సర్కార్. ఆప్షన్స్ ఇవ్వాలి అనే మాట లెక్క చెయ్యకుండా, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల పై హైకోర్టు మొట్టికాయలు వేసినా తీరు మారటం లేదు. మరో రూట్ లో, మళ్లీ ఆంగ్ల మాధ్యమాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది.
నిన్న ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల సారాంశం ఇలాగే ఉంది. అర్ధరాత్రి ఇంగ్లీష్ మీడియం పై మరో జీవో తెచ్చింది జగన్ సర్కారు. వాలంటీర్ల ద్వారా, మరో సర్వేకు తెర లేపింది. అందరి ఇళ్ళకు వెళ్లి, ఏ మీడియం చదవు కావాలో, సర్వే చేయ్యనుంది. తల్లిదండ్రులు ఇంగ్లీషే కావలంటున్నారనే వంకతో మళ్ళీ ఆంగ్ల మాధ్యమాన్ని తెరపైకి తెచ్చేలా స్కెచ్ వేసింది. గ్రామ సచివాలయాల్లో మాధ్యమం ఎంపిక ఫారాల వెనుక మాటలబు ఇదే అని అంటున్నారు. ఈ సర్వే వీలు అయినంత త్వరగా చేసి, ఆ సర్వే ఆధారంగా, మళ్ళీ సుప్రీం కోర్ట్ కు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం కావాలని ఆప్షన్ ఇవ్వకుండా, మీడియం ఎంచుకునే స్వేఛ్చ ఇవ్వకుండా, ఇంగ్లీష్ మీడియం బలవంతంగా రుద్దుతుంది అని చెప్తుంటే, ఇప్పుడు అదే ప్రభుత్వం చేస్తున్న సర్వేని, కోర్టులు ప్రామాణికంగా తీసుకుంటాయా ? చూడాలి మరి, తరువాత ఏమి జరుగుతుందో ?