ఏపి మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అమరావతిలో భూములు అక్రమంగా కొనుగోలు చేసారు అంటూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై, గతంలో హైకోర్టు స్టే విధించింది. అయితే హైకోర్టు విధించిన ఆ స్టే పై, సుప్రీం కోర్టుని ఏపి ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ రోజు సుప్రీం కోర్టులో ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ విచారణకు వచ్చింది. అయితే అనూహ్యంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ పిటీషన్ ను ఉపసంహరించుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది. హైకోర్టులో కౌంటర్ వేయటానికి అనుకూలంగా, ఈ పిటీషన్ ఉపసంహరణ చేస్తున్నాం అని, దీనికి అనుమతి ఇవ్వాలి అంటూ, ఏపి ప్రభుత్వం తరుపున హాజరయిన న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. వినీత్ శరన్, దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేసింది. అయితే ఇందులో మరో ట్విస్ట్ ఉంది. ఈ పిటీషన్ వేసి ఏడు నెలలు అయినా, ఇంకా మీరు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు అని, ధర్మాసనం ఏపి ప్రభుత్వానికి ప్రశ్నలు వేసింది. అయితే ఈ విషయం కూడా మాకు ఇప్పుడే తెలిసిందని, అందుకే ఇక్కడ కేసు ఉపసంహరించుకుని, హైకోర్టులోనే దీని పై విచారణ కోరబోతున్నాం అని, ఏపి ప్రభుత్వం తరుపు న్యాయవాది చెప్పటంతో, సుప్రీం కోర్టు కూడా ఈ పిటీషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది.

sc 22072021 2

ఈ పిటీషన్ ఉపసంహరణకు ఒప్పుకున్న ధర్మాసనం, నాలుగు వారాల్లో ఈ కేసుని తేల్చాలి అంటూ, సుప్రీం కోర్టు, హైకోర్టుని ఆదేశించింది. అయితే ఈ కేసులో గతంలో, దమ్మాలపాటి, గతంలో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సందర్భంలో, ఏపి ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు, దీని పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తరువాత, ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది కాబట్టి, దానికి అనుగుణంగా ఒక సవరణ పిటీషన్ దాఖలు చేసేందుకు ఒక సవరణ పిటీషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని, దమ్మాలపాటి కోరటం జరిగింది. దీనికి కూడా సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. దమ్మాలపాటి దాఖలు చేసిన సవరణ పిటీషన్ ను సుప్రీంలో వాదించటానికి, ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఇక నాలుగు వారాల్లో ఈ కేసున తేల్చాలని సుప్రీం ఆదేశించింది. అయితే ఏపి ప్రభుత్వం ఎందుకు మనసు మార్చుకుంది ? ఏడు నెలల పాటు, నాన్చి ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకు వెళ్తాం అని చెప్పటం పై, ఏపి ప్రభుత్వం లాయర్లు ఏ వ్యూహంతో ఉన్నారో చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read