రాష్ట్ర వ్యాప్తంగానే కాన, దేశ వ్యాప్తంగా సంచలనం అయిన, డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు ఉత్తర్వు లపై సుప్రీంకోర్టుకు అప్పీలకు వెళ్ళనున్న రాష్ట్ర ప్రభుత్వం యోరిస్తోంది. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయనను సస్పెండ్ చేసింది. అనంతరం రోడ్డు పై ఆయన న్యూసెన్స్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన చేతులు వెనక్కు కట్టివేసి పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. అంతే కాకుండా ఆయనకు మతిస్థిమితం కోల్పోయారని మానసిక వైద్యశాలకు తరలించారు. దీనిపై హైకోర్టు సుమోటో కేసుగా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం ఇచ్చిన వివరణకు, వాస్తవానికి చాలా తేడాలు ఉన్నట్లు న్యాయస్థానం వ్యాఖ్యానించింది. డాక్టర్ సుధాకర్ శరీరంపై గాయాలు కూడా ఉండటంతో పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానిస్తూ సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఒక్క గాయం ఉంటే, మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో, ఆరు గాయాలు ఉన్నాయని, ఫోటోలు కూడా ఉన్నాయని, ఈ తేడా ఎందుకో అర్ధం కావటం లేదని, ప్రభుత్వం పై మాకు నమ్మకం లేదు అంటూ, కేసు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాగే విశాఖ పోలీసులే, ఆయన్ను కొట్టి దాడి చేసారని, ఆరోపణలు వస్తున్న వేళ, వారి చేతే విచారణ చేపించటం సమంజసం కాదని భావించిన హైకోర్ట్, ఈ కేసు విచారణ సిబిఐకి అప్పచెప్తూ, హైకోర్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చల జరిపింది. ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా తమ వాదనను వినిపించాలని న్యాయనిపుణులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. మరి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read