అగ్రిగోల్డ్‌ బాధితులను సొంతంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నమొత్తంలో డిపాజిట్లు చేసిన నిరుపేద వర్గాలకు ప్రభుత్వమే సొంత ఖర్చుతో సహాయం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే అగ్రిగోల్డ్‌ కేసు ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉన్నందున ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించాలని, ఈ కేసులో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రత్యేక న్యాయనిపుణుడిని రప్పించి కోర్టులో వాదనలు వినిపించాలని గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశ వివరాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏపీలో కనీసం 19లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులున్నారు. ఏపీకి చెందిన వారికే లబ్ధిచేకూరుస్తామని స్పష్టం చేశారు.

agrigold 01062018 2

ఇదే అంశంపై అధ్యయనం చేస్తున్న మంత్రివర్గ ఉపసంఘాన్ని త్వరగా అధ్యయన నివేదిక సమర్పించాలని మంత్రివర్గం ఆదేశించినట్లు కాలువ వివరించారు. మరో పక్క నిన్న, అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును గురువారం కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 13 జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేసుకుని, కోర్టుకు హాజరై, తమ సమస్యల్ని వివరంగా చెప్పాలని సూచించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వపరంగా అన్ని చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిన్న ఆగ్రిగోల్డ్ బాధితులు 24 గంటల దీక్ష చేపట్టారు. వీరితో ప్రభుత్వం చర్చించింది.

agrigold 01062018 3

అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను అతి త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు హామీ ఇచ్చారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బుధవారం నాడు అగ్రిగోల్డ్‌ బాధితులు ప్రారంభించిన నిరసన దీక్షను ఆయన గురువారం విరమింపచేశారు. గురువారం ప్రకటించిన అగ్రిగోల్డ్‌ బాధితుల ఆత్మఘోష పాదయాత్రను కూడా విరమిస్తున్నట్టు బాధితుల అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రకటించారు. జూన్‌ 5 వరకు ఉన్న కోర్టు సెలవులు పూర్తయ్యే నాటికి ప్రభుత్వం స్పష్టమైన హామీతో రాకపోతే తిరిగి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read