ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేసినా వ్యతిరేకించాలి అని, కేంద్ర ప్రభుత్వం వైఖరి తీసుకున్నట్టు ఉంది... చివరకు యూపీఎస్సీ నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా కేంద్రమే తీసుకుంటూ, చంద్రబాబుని చికాకు పెడుతుంది... డీజీపీ ఎంపిక విషయంలో, కేంద్రం జోక్యం చేసుకోవటంతో చంద్రబాబుకి చిర్రెత్తుకు వచ్చి, కేంద్రానికి ఘాటు లేఖ రాసింది... మీకు ఫలానా వారు ఉండొద్దని చెప్పే అధికారం లేదు అంటూ కేంద్ర హోంశాఖకు లేఖలో ఏపీ స్పష్టం చేసింది. మీకు ఏమైనా అభ్యంతరాలుంటే యూపీఎస్సీకి చెప్పుకోవచ్చని లేఖలో సూచించింది.
ఇన్చార్జ్ డీజీపీగా ఉన్న నండూరి సాంబశివరావును పూర్తి స్థాయి డీజీపీగా నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సమర్ధవంతమిన అధికారిగా పేరు ఉండటంతో, రాష్ట్ర ప్రభుత్వం, ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. సహజంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ జాబితాను యూపీఎస్సీకి పంపాలి. కానీ కేంద్రహోంశాఖ ఏపీ ప్రభుత్వం పంపిన జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ఎస్.వి.రమణమూర్తి, మాలకొండయ్య, ఎన్.సాంబశివరావులు ఏడాదిలోపే పదవీ విరమణ చేస్తున్నారని అటువంటి పేర్లను డీజీపీ ఎంపిక కోసం పంపడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ తిప్పి పంపింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయనిపుణులతో సంప్రదించి, అవే పేర్లు మళ్ళీ కేంద్రానికి పంపి, ఘాటు లేఖ రాసింది. జాబితాలో ఫలానా పేరు ఉండొద్దని చెప్పడానికి కేంద్ర హోంశాఖకు ఎలాంటి అధికారాలు లేవని లేఖలో ఏపీ స్పష్టం చేసింది. మీకు ఏమైనా అభ్యంతరాలుంటే యూపీఎస్సీకి చెప్పుకోవచ్చని లేఖలో సూచించింది. మరో పక్క తెలంగాణలో అనురాగ్ శర్మను రిటైర్డ్ మెంట్ కొద్ది రోజుల ముందే ప్యానల్ ద్వారా ఎంపిక చేసి, మరో రెండేళ్లు కొనసాగించిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. తెలంగాణ ఆదికారిని కొనసాగించడంలో లేని అభ్యంతరం ఏపీ ఆధికారి విషయంలోనే ఎందుకని కేంద్రాన్ని నిలదీసింది...రాష్ట్ర ప్రభుత్వ లేఖతో కేంద్రహోంశాఖ దిగి వచ్చింది. ఈ నెల ఇరవై రెండో తేదీన డీజీపీ ఎంపిక కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.