సిబిఐ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జాతీయ స్థాయిలో, చర్చకు దారి తీసింది. ఎక్కువ మంది, ఏపి ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నా, ఇంకా కొంత మంది విమర్శిస్తున్నారు. దీంతో సీబీఐ పరిధికి కత్తెర వేస్తూ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు, కారణాలు, రాష్ట్రానికి ఈ విషయంలో ఉన్న అధికారంపై ప్రజలకు పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిపై అవగాహన పత్రాలు ముద్రించి పంపిణీ చేయాలని తీర్మానించింది. ‘‘ఇది కొత్తగా, మన రాష్ట్రం ఒక్కటే తీసుకున్న నిర్ణయం కాదు. 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాలు సీబీఐకి జనరల్‌ కన్సెంట్‌ ఇవ్వలేదు. ఇందులో బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, హరియాణా, ఛత్తీ్‌సగఢ్‌ వంటివీ ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో కొంత కాలం క్రితమే సీబీఐ అధికార పరిధి పెంచారు. దేశంలో మెజారిటీ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్నే ఏపీ ఎంచుకుంది. మోదీ పాలనలో సీబీఐ స్వయంప్రతిపత్తిని కోల్పోయినందునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

cbi 17112018 2

సీబీఐకి సాధారణ అనుమతి ఉపసంహరణపై.. అనవ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నారని ఏపీ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో 10 రాష్ట్రాలే సాధారణ అనుమతి ఇచ్చాయన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో దర్యాప్తు చేయాలంటే రాష్ట్రాల అనుమ‌తి తప్పనిసరి అని ఆయన అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, హిమాచల్‌ వంటి రాష్ట్రాల్లో సీబీఐకి సాధారణ అనుమతి ఇవ్వలేదని.. కోర్టులు అదేశిస్తే సీబీఐ ఎక్కడైనా దర్యాప్తు చేయవచ్చునని కుటుంబరావు తెలిపారు.

cbi 17112018 3

ప్రస్తుతం సీబీఐలో జరగుతున్న పరిణామాలను చూస్తుంటే... దొంగ కేసులను నమోదు చేస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయని కుటుంబరావు అన్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో కేవలం 60 శాతమే శిక్షలు ఖరారయ్యాయన్నారు. ఢిల్లీ పోలీస్ చ‌ట్టం చ‌దివితే సీబీఐ ప‌రిధి ఏంటో తెలుస్తుందని అన్నారు. వైసీపీ నేతలు ఆర్థిక ఉగ్రవాదంలో మునిగితేలారని కుటుంబరావు ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి భాజపా పాలిత రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తునకు సాధారణ సమ్మతి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. దీనిపై భాజపా ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు ఎందుకు స్పందించడం లేదన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆర్థిక ఉగ్రవాదం, సీబీఐ కేసుల్లోనూ ఆరితేరారని, అందుకే ముందుగా ఆయనే ట్విట్టర్లో స్పందించారని విమర్శించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read