ఏపికి విభజన హమీలు, ప్రత్యేక హోదా విషయం పై, సుప్రీం కోర్ట్ లో ఉన్న కేసు విషయంలో, కేంద్రం వివాదాస్పద అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని పై చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు కాల్వ శ్రీనివాస్, ఆనందబాబు, పితాని సత్యనారాయణ, సీనియర్‌ ఐఏఎస్‌లు పాల్గొన్నారు. ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనేదానిపై సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. దీని పై రాష్ట్ర ప్రభుత్వం గట్టి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చెయ్యటానికి రెడీ అయ్యింది. దీని పై న్యాయ నిపుణులతో చర్చించి, మన వాదనలు ఎలా ఉండాలి అనే దాని పై చర్చలు జరిపారు.

cbn meet 04072018 2

సుప్రీంకోర్టులో కేంద్ర ఆర్థికశాఖ దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏపీకి విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇచ్చామని, ఇక ఇచ్చేదేం లేదన్న కేంద్రం ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. పొంగులేటి పిటిషన్‌లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ కొన్ని కీలక విషయాలను ప్రస్తావించింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం అధికారికంగా సుప్రీంకోర్టుకు చెప్పింది. రాజ్యసభలో మన్మోహన్ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని కేంద్రం కోర్టుకు స్పష్టం చేసింది. అయితే ఈ అఫిడవిట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ రైల్వేజోన్ ఊసెత్తక పోవడం గమనార్హం.

cbn meet 04072018 3

విభజన హామీల అమలుపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని.. పోలవరం ముంపుపై అధ్యయనం, బయ్యారం స్టీల్ ప్లాంట్, విభజిత ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో పొంగులేటి సుధాకర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకొచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం స్పష్టతనివ్వాలంటూ ధర్మాసనం ఆదేశించింది. దీంతో కేంద్రం సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. దుగ్గరాజపట్నం పోర్టుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం అంటూనే.. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం అంటూ కేంద్రం మెలిక పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీ ఎంత వరకు అమలు చేశారన్న విషయాన్ని కేంద్రం వెల్లడించలేదు. ఈఏపీలపై స్పష్టంగా ప్రస్తావించలేదు. విభజన జరిగిన ఏడాది ఏపీ రెవెన్యూలోటు రూ. 4116 కోట్లు మాత్రమేనని, ఇప్పటి వరకూ 3979 కోట్లు ఇచ్చామని కేంద్రం లెక్కలు చెప్పుకొచ్చింది. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చామని, యూసీలు ఇచ్చిన తరువాత మరో మూడేళ్లలో ఏడాదికి రూ. 330 కోట్ల చొప్పున వెయ్యి కోట్లు ఇస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read