ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఈ తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017-2018వ ఆర్ధిక సంవత్సరం నుంచి కూడా, చేపట్టిన ఉపాధి హామీ పధకం పనులకు సంబంధించిన నరేగా పనులకు సంబందించిన, బిల్లులు ఈ రోజు వరకు కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదు. అవి చంద్రబాబు హయాంలో జరిగిన పనులు అని, చంద్రబాబు మనుషులకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనే విధంగా, జగన్ మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వలేదు. గత రెండేళ్ళ నుంచి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ విషయం పై అడిగీ అడిగీ విసిగి పోయారు. అయినా ఎక్కడా డబ్బులు రాకపోవటంతో, అప్పుడు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ లు అందరూ కూడా, హైకోర్టుని ఆశ్రయించారు. మొత్తం 1013 పిటిషన్లు, ఈ విషయం పై హైకోర్టులో పిటీషన్లు పడ్డాయి. అయితే గత కొన్ని నెలలుగా హైకోర్టులో ఈ కేసు నలుగుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ రోజు హైకోర్టు తీర్పుని ప్రకటించింది. ఈ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు చేతిలో గట్టిగా మొట్టికాయలు పడ్డాయి. ఎప్పటి నుంచి అయితే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయో, ఆ బిల్లులు మొత్తానికి కూడా 12 శాతం వడ్డీతో కలిపి, వెంటనే చెల్లించాలి అంటూ, హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో ఒక విశేషం ఏమిటి అంటే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు అయితే రీసెంట్ గా పదవీ విరమణ చేసారో, ఆయన కోర్టుకు వచ్చి, ఏపిలో జరుగుతున్న ఉపాధి హామీ పధకం పనులకు, ఎటువంటి విజిలెన్స్ ఎంక్వయిరీ విచారణ జరగటం లేదని, స్వయంగా చెప్పటంతో, హైకోర్టు రికార్డు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయం చెప్పింది. దీంతో, 1013 పిటిషన్ల పై హైకోర్టు ఒకేసారి తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా బిల్లులు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రభుత్వం, 20 శాతం బిల్లులు తగ్గించి ఇవ్వాలి అంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోని కూడా హైకోర్టు కొట్టేసింది. ఇప్పటికే కొంత చెల్లిస్తే, దానికి 12 శాతం వడ్డీతో చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తానికి ఇది వైసిపీ ప్రభుత్వానికి భారీ దెబ్బ అనే చెప్పాలి. అయితే 1013 పిటిషన్ల విషయంలో ఇలా ఒకేసారి కామన్ గా తీర్పు రావటం, ప్రభుత్వం యొక్క కక్ష పూరిత విధానం, ఈ సందర్భంగా ప్రజలకు మరోసారి తెలిసింది.