రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుండి కట్టాల్సిన వివిధ రకాల పన్నులను ఇక నుండి ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకు విధి విధానాలను రూపొందించింది. అయితే, నిరుపేదలు నివసించే ఇళ్లకు పన్ను మినహాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కుళాయి కనెక్షన్, చిన్న తరహా పరిశ్రమలు, భవనాలు, లే అవుట్లు అనుమతులు, ఆస్తి పన్ను విధింపులు వంటి అన్ని రకాల పన్నులను ఆన్లైన్ విధానం ద్వారా రాబట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

tax 21012018 2

ఇప్పటికే జనన మరణ ధృవీకరణ పత్రాలు, వ్యాపార లైసెన్సుల జారీ వంటివి ఆన్లైన్ విధానంలోనే జారీ చేస్తున్నారు. ఇంటి అసెస్మెంట్ నెంబర్ నమోదు చేసిన వెంటనే పన్నులకు సంబంధించిన అన్ని వివరాలు కంప్యూటర్ స్క్రీన్ పై కనిపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. భవన నిర్మాణాలకు సంబంధించి భవనం, వెడల్పు పొడవు ఆయా పంచాయతీల తీర్మానాల ప్రకారం విధించిన రేట్ల పై ఆయా నిర్మాణాలు వాణిజ్య లేదా నివాస లేదా అద్దె కు ఇవ్వడం వంటి అంశాలను కూడా కంప్యూటర్లలో నిక్షిప్తం చేయనున్నారు. బిల్లుల చెల్లింపు, పన్నుల వసూళ్లు కూడా ఇక మరో చోటుకి వెళ్లకుండా ఇంటి నుంచే చెల్లించేలా ఏర్పాట్లను చేయనున్నారు.

tax 21012018 3

పంచాయతీల పరిధిలో పూరిళ్లలో, గుడిసెల్లో నివాసముండే పేద వర్గాల ప్రజలకు పన్ను మినహాయింపు ఇచ్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధిం విధి విధానాలను రూపొందించాక అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ నమోదు, మ్యూటేషన్, ఆస్తి విలువ ధృవీకరణ, గ్రామీణ ఉపాధి హామీ వంటివి కూడా ఆన్లైన్లో ప్రజలు పొందగలిగేలా చేయనున్నారు. ఆస్తి పన్ను విధించాక ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే తెలుసుకునేందుకు గాను గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్సైట్లలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read