ఏపీలో మరో అద్భుతం ఆవిష్కృతమవుతోంది. పేదవాడి కలలను సీఎం చంద్రబాబు నిజం చేయనున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సంక్షేమ కార్యక్రమాల ద్వారా అన్నీ వర్గాలకు ప్రభుత్వం దగ్గరవుతోంది. శనివారం ఒకే రోజు 4 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు కల్పించబోతోంది. అర్బన్ ఏరియాలో లక్ష ఇళ్ల ప్రారంభోత్సవం చేయనున్నారు. రూరల్ హౌసింగ్ కింద 3 లక్షల ఇళ్ల ఓపెనింగ్ చేస్తారు. నెల్లూరులో గృహ ప్రవేశ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పాల్గొననున్నారు. తిరుపతిలో గృహ ప్రవేశాల కార్యక్రమంలో మంత్రులు లోకేష్, కాల్వ శ్రీనివాసులు పాల్గొననున్నారు.

housnig 08022019

ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ అధికారులు రెండు విడతలుగా పేదల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించారు. తాజాగా మరో 4 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు పండగ వాతావరణంలో నిర్వహించి పేదలకు అంకితమివ్వాలని నిర్ణయించారు. ఇందుకు ఫిబ్రవరి 9వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. గ్రామీణ పరిధిలో 3 లక్షల ఇళ్లకు, పట్టణ పరిధిలో లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో మంత్రి కాలవ శ్రీనివాసులు అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

 

housnig 08022019

9న ఉదయం నెల్లూరులో నిర్వహించే పట్టణ గృహ ప్రవేశ మహోత్సవంలో, మధ్యాహ్నాం తిరుపతిలో గ్రామీణ గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారు.. మార్చిలోపు 19 లక్షల ఇళ్లను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రెండు విడతల్లో 5.80 లక్షల ఇళ్లను పేదలకు అందజేశారు. తాజాగా మరో నాలుగు లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలను నిర్వహించి, అందజేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 7.5 లక్షల ఇళ్లను నిర్మించాలని సంకల్పించారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ పేదల గృహ నిర్మాణంపై పెద్దఎత్తున నిధులు వెచ్చించింది. పట్టణ పేదల కోసం షీర్‌వాల్‌ సాంకేతికతతో ఒకే ప్రాంతంలో వెయ్యి మొదలు 10 వేల వరకు గృహాలుండేలా ఆధునిక వసతులతో నిర్మించి ఇస్తోంది. ఎన్టీఆర్‌ పథకం అమలుకన్నా ముందున్న, అసంపూర్తిగా మిగిలిన ఇళ్ల పూర్తికి ప్రాధాన్యం ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read