రాష్ట్రంలో ఐటీ కంపెనీలను ఏర్పాటుచేసే విషయంలో వివిధ విదేశీ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకునే దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ గుజరాత్‌ కంటే కేవలం రెండు పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉంది. విశాఖపట్టణంలో నిర్వహంచిన భాగస్వామ్య సదస్సుల్లో మెజారిటీ ఐటీ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాలను ప్రారంభించాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. గతంలో ఐటీ రంగ వికాసం కోసం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సైబరాబాద్‌ వంటి నగరాలను నవ్యాంధ్రలో ఐదు చోట్ల ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఎలక్ట్రానిక్‌ పాలసీని ప్రకటించింది.

ap 13082018 2

దీనికి అనుగు ణంగా ఐటీ పరిశ్రమల నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు లభిస్తోంది. ఇదే సమయంలో ప్రవాసాంధ్ర ఐటీ సంస్థల అధినేతలు కూడా అమరావతిలోనే తమ ప్రాజెక్టులను ప్రారంభించి ఇప్పటికే 36 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. అమరావతి, విశాఖపట్టణం నగరాలు ఇప్పటికే ప్రపంచస్థాయి ఐటీ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. అనేక సంస్థలకు భూముల కేటాయింపుతోపాటు వివిధ అనుమతులకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టిన నేపద్యంలో అమరావతి ఐటీ హబ్‌గా అతి త్వరలోనే ఏర్పడ బోతుందనే సంకేతాలు వెలువడ్డాయి.

ap 13082018 3

యాంటోలిన్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌, కాండ్యూంట్‌, హెచ్‌సీఎల్‌ వంటి మొత్తం 75 సంస్థలు గత రెండేళ్లలో తమ కంపెనీలను అమరావతిలో ప్రారంభించాయి. విశాఖపట్టణంలో కల్పించిన విధంగానే అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా ఐటీ కంపెనీల స్థాపనకు ప్రభుత్వం నుండి మరింత చొరవ లభిస్తే అమెరికాలో ఉన్న మరికొంత మంది తెలుగువారు తమ ఐటీ సంస్థలను శరవేగంగా పెట్టుబడులతో వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు గుణాత్మకమైన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారని, జన్మభూమి రుణం తీర్చుకోవడానికి సిద్ధపడి ఇక్కడ తమ కంపెనీలను ప్రారంభించడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్నారని ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ తెలిపారు.

వీటిలో భాగంగా ఇన్‌వేకాస్‌ సంస్థ ఐటీ రంగంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు ఆ సంస్థకు అనుగుణంగా ఉన్న ఇంటెల్‌, ఏఎండీ, కేడిన్స్‌, మెనార్‌ గ్రాఫిక్స్‌ వంటి సంస్థలు కూడా పరిశోధనలు చేపట్టి నవ్యాంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా దొహద పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఐటీ చట్టం ద్వారా ప్రవాసాంధ్రులు నడుపుతున్న ఐటీ కంపెనీల బ్రాంచిలను ఆంధ్ర ప్రదేశ్‌లో ఏర్పాటు చేయించాలనే లక్ష్యంతో తమ సంస్థ ముందడుగు వేసిందని ఇన్‌ వేకాస్‌ సంస్థ వ్యవస్థాపకుడు దశరథ్‌ గూడే తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read