ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ వికృత రాజకీయ క్రీడ మొదలైంది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన దుర్గి మండల కేద్రంలో నిన్న వైసిపి నేత దుర్గి జడ్డ్పిటిసి కుమారుడు ,NTR విగ్రహాన్ని పెద్ద సుత్తితో కొట్టే ప్రయత్నం చేసాడు. అది కూడా ఎవరు చూడకుండానో, అర్ధరాత్రో కాకుండా పట్ట పగలే,ప్రజలందరూ చూస్తుండగానే ఆయన విగ్రహం పై సుత్తితో దాడికి పాల్పడటంతో అక్కడున్న ప్రజలందరూ కూడా విస్తు పోయారు. నిన్న దా-డి-కి యత్నించిన తరువాత టిడిపి శ్రేణులు కూడా తీవ్ర సస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేసారు. ఈ రోజు దుర్గిలో ఎక్కడయితే ఎన్టీఆర్ విగ్రహాన్ని పగల కొట్టటానికి ప్రయత్నం చేసారో, అదే విగ్రహం ముందు, అక్కడ ఈ రోజు మాచర్ల టిడిపి ఇంచార్జి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆద్వర్యంలో నిరసన కార్యక్రమానికి సిద్దమయ్యారు. అయితే పోలీసులు ముందస్తుగా పల్నాడు ప్రాంతానికి వచ్చిన టిడిపి నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసారు. కొంత మందిని దుర్గిలోని నేతలను కూడా అరెస్ట్ చెయ్యటం కూడా జరిగింది. నరసరావు పేట టిడిపి ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబుని ఈ రోజు ఉదయమే నరసరావు పేటలో హౌస్ అరెస్ట్ చేయగా, మాచర్ల మాజీ టిడిపి ఇంచార్జి అక్కడకు వెళ్ళే ప్రయత్నం చేయగా ఆయనను కుడా అరెస్ట్ చేయటం జరిగింది. ఇక మరో వైపు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాత్రం పోలిసుల కళ్ళు కప్పిఆయన బైక్ మీద వెళ్లినట్టు అయన సన్నిహితులు చెబుతున్నారు.

ap 0302 2022 2

ఎట్టి పరిస్థితిలో కూడా అక్కడకు వెళ్లి నిరసన తెలుపుతామని కూడా టిడిపి నేతలు స్పష్టం చేసారు. అయితే పోలీసులు మాత్రం దుర్గిలో 144 సెక్షన్ పెట్టి ఎన్టీఆర్ విగ్రహం పెద్ద సంఖ్యలో మొహరించటం జరిగింది. తరువాత జూలకంటిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. మరో వైపు దుర్గి లోని వ్యాపార సముదాయాలన్ని మూత పడ్డాయి. పల్నాడు ప్రాంతం లో వైసిపి రెండున్నర్ర ఏళ్ళ నుంచి అర్రచాకలు సృష్టిస్తుందని టిడిపి ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు తాజాగా మాచర్ల టిడిపి ఇంచార్జి కొత్తగా జూలకంటి ని నియమించటం ఆయన 5 రోజుల క్రితం ఇంచార్జి ఇచ్చిన తరువాత , గుంటూరునుంచి మాచర్లకు వెళ్ళే సమయంలో అతనికి ఘన స్వా గతం చెప్పి, బ్రహ్మరథంతో , కారంపూడి నుంచి మాచర్ల వరకు కూడా భారీ ర్యాలి పెట్టారు. ఈ ర్యాలి వచ్చిన జన సందోహాన్ని చూసి వైసిపి నేతలు ఖంగు తిన్నారు. దీన్నీ తట్టుకోలేని వైసిపి నేతలు జూలకంటి బ్రహ్మానంద రెడ్డికి కట్టిన ఫ్లేక్సిలను చింపేసారని టిడిపి నేతలు ఆగ్రహంతో ఉండగా మనల్ని రెచ్చగొట్టటానికే వైసిపి నేతలు ఇలా చేస్తున్నారని కూడా బ్రహ్మానంద రెడ్డి వారిని సముదాయించారు. కాని ఎన్టీఆర్ విగ్రహాన్ని ద్వంసం చేయటం మాత్రం ఘోరమైన అవమానమని భావిస్తున్నారు. దీనిని స్థానిక నేతలే కాకుండా రాష్ట్ర స్థాయి నేతలు, చంద్రబాబు కూడా ఖండించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read